Instagram Down | మెటా ఆధీనంలోని ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్స్టాగ్రామ్ సేవల్లో అంతరాయం (Instagram Down) ఏర్పడింది. సాంకేతిక సమస్యల కారణంగా భారత్ (India)లో చాలా మంది వినియోగదారులు (Users) ఇన్‌స్టా సేవల్లో సమస్యలు ఎదుర్కొన్నారు. మంగళవారం ఉదయం 11:15 గంటల సమయంలో లాగిన్, సర్వర్ కనెక్షన్ వంటి సమస్యలు తలెత్తాయి.
డౌన్ డిటెక్టర్ (Downdetector) వెబ్సైట్ ప్రకారం.. 64 శాతం కంటే ఎక్కువ మంది యూజర్లు యాప్‌లోకి లాగిన్ అవ్వడంలో సమస్యలు ఎదుర్కోగా.. 24 శాతం మంది సర్వర్ కనెక్షన్ ప్రాబ్లమ్‌ను నివేదించారు. తమకు కలిగిన అంతరాయాన్ని పలువురు యూజర్లు ఎక్స్ ద్వారా పంచుకున్నారు. కొందరికి స్క్రీన్‌పై ‘సమ్ థింగ్ వెంట్ రాంగ్’ వంటి మెసేజ్‌లు దర్శనమిచ్చాయి. దీంతో యూజర్లు అయోమయానికి గురయ్యారు.
Also Read..
Haryana Elections | హర్యానాలో బీజేపీ తొలి విజయం.. కాంగ్రెస్ అభ్యర్థిపై 16 వేల ఓట్ల తేడాతో గెలుపు
Azharuddin | ఈడీ విచారణకు కాంగ్రెస్ నేత అజారుద్దీన్