Azharuddin | ఈడీ విచారణకు కాంగ్రెస్ నేత అజారుద్దీన్
తెలంగాణ కాంగ్రెస్ కమిటీ వరింగ్ ప్రెసిడెంట్, హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు, భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ (Azharuddin) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) విచారణకు హాజరయ్యారు. హెచ్‌సీఏలో రూ.20 కోట్ల మోసం వ్యవహారంలో ఇటీవల ఆయనకు ఈడీ నోటీసులు జారీచేసింది.
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ కమిటీ వరింగ్ ప్రెసిడెంట్, హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు, భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ (Azharuddin) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) విచారణకు హాజరయ్యారు. హెచ్‌సీఏలో రూ.20 కోట్ల మోసం వ్యవహారంలో ఇటీవల ఆయనకు ఈడీ నోటీసులు జారీచేసింది. దీంతో మంగళవారం హైదరాబాద్‌లోని ఆ సంస్థ కార్యాలయంలో విచారణకు వచ్చారు. ఈ సందర్భంగా అజహర్ మాట్లాడుతూ.. తనపై వచ్చినవి తప్పుడు ఆరోపణలని చెప్పారు.
2019 నుంచి 2023 వరకు హెచ్‌సీఏలో జరిగిన అక్రమాలపై ఉప్పల్ పోలీస్ స్టేషన్లో పలు ఫిర్యాదులు ఉన్నాయి. వీటికి తోడు ఉప్పల్ స్టేడియంలో హెచ్‌సీఏ అక్రమాలపై ఏసీబీ అధికారులు సైతం పలు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. వీటి ఆధారంగా ఈడీ అధికారులు ఈసీఆర్ నమోదు చేశారు. అజారుద్దీన్ పదవీకాలంలో క్రికెట్ బాల్స్, బకెట్ చైర్స్, జిమ్ పరికరాలకు కొనుగోళ్లలో భారీగా అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలోనే హెచ్‌సీఏలో అక్రమాలపై ఈడీ నజర్ పెట్టింది. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయిలో హెచ్‌సీఏలోని అక్రమాలపై విచారణకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. కాగా ఇదే కేసులో మాజీ క్రికెటర్లు అర్షద్ అయూబ్, శివలాల్ యాదవ్‌ను గత డిసెంబర్లో ఈడీ అధికారులు విచారించారు.
గతంలోనూ విచారణ..
ఇదే రూ.20 కోట్ల అంశానికి సంబంధించి హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్‌కు ఈడీ అధికారులు గత డిసెంబర్లో నోటీసులు జారీ చేశారు. ఈ ఏడాది జనవరి మొదటి వారంలో ఈడీ ఎదుట హాజరుకావాలని వినోద్‌కు నోటీసులు పంపి, విచారించారు. ఉప్పల్ స్టేడియం మరమ్మతుల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడి నిధులు స్వాహా చేశారని, అవినీతి నిరోధక శాఖ మూడు కేసులు నమోదు చేసింది. ఈ కేసుల ఆధారంగా మనీ లాండరింగ్ చట్టం కింద మరో కేసును నమోదు చేసిన ఈడీ దర్యాప్తు చేపట్టింది. ఇదే వ్యవహారంలో గత నవంబర్‌లో తెలంగాణ వ్యాప్తంగా 9 చోట్ల సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో డాక్యుమెంట్లు, డిజిటల్ పరికరాలు, రూ.10,39,000ల నగదును ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- Azharuddin
- ED
- ED summons
- HCA
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

