Jammu Kashmir | జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇక్కడ భారతీయ జనతా పార్టీ (BJP) ఖాతా తెరిచింది. తొలి విజయం నమోదు చేసింది. బసోలి అసెంబ్లీ స్థానం (Basohli Assembly seat) నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి దర్శన్ కుమార్ (Darshan Kumar) విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి లాల్ సింగ్ (Lal Singh)పై 16,034 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఎన్నికల సంఘం డేటా ప్రకారం.. దర్శన్ కుమార్కు 31,874 ఓట్లు పోలవగా.. లాల్ సింగ్కు 15,840 ఓట్లు వచ్చాయి. దీంతో దర్శన్ గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు.