Water Crisis : ఢిల్లీలో నీటి సంక్షోభానికి నిరసనగా ఢిల్లీ మంత్రి, ఆప్ నేత అతిషి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షపై బీజేపీ ఢిల్లీ చీఫ్ వీరేంద్ర సచ్దేవ విమర్శలు గుప్పించారు. మీడియా ఫొటోలకు ఫోజులిచ్చేందుకు రెండు గంటల పాటు ఆమె వేదిక వద్ద గడుపుతున్నారని, ఇదేం నిరాహార దీక్ష అని ఆయన ఎద్దేవా చేశారు.
ఇది ఎయిర్ కండిషన్డ్ సత్యాగ్రహంలా ఉందని వ్యాఖ్యానించారు. ఈ రాజకీయ డ్రామాతో అతిషి ఢిల్లీ ప్రజలను మోసం చేయలేరని పేర్కొన్నారు.
ఢిల్లీ మంత్రులు సత్యాగ్రహాలు, బెయిల్, జైలు, అవినీతి క్రీడల్లో మునిగితేలుతున్నారని వీరేంద్ర సచ్దేవ దుయ్యబట్టారు. ఇక దేశ రాజధానిలో ప్రజలు నీటి కష్టాలతో సతమతమవుతున్నారు.
Read More :