Karnataka : కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరిన అనంతరం అవినీతి రాజ్యమేలుతోందని, రాష్ట్రం కుంభకోణల మయమైందని బీజేపీ ఎంపీ సుధాన్షు త్రివేది ఆరోపించారు. కర్నాటకలో ఇటీవల అవినీతి పెచ్చుమీరిందని, బలహీనవర్గాలు,అణగారిన వర్గాల అభ్యున్నతికి ఉద్దేశించిన నిధులను అవినీతితో రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రంలో వెలుగుచూసిన స్కామ్‌లపై అత్యున్నత స్ధాయి దర్యాప్తు చేపట్టాలని తాము డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. అవినీతి బాగోతాల వ్యవహారంలో కర్నాటక సీఎం సిద్ధరామయ్య నైతిక బాధ్యత వహించాలని ఆయన కోరారు. ఇక కేంద్ర బడ్జెట్లో కర్నాటకకు దక్కిందేమీ లేదని రాష్ట్ర మంత్రి ఈశ్వర్ ఖండ్రే ఆరోపించారు.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ కర్నాకటకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని అన్నారు. కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కర్నాటకకు ఇచ్చిందేమీ లేదని పెదవివిరిచారు. కర్నాటకకు వారు ప్రకటించిన ప్రాజెక్టులకు కూడా నిధులు కేటాయించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది కర్నాటకకు తీవ్ర అన్యాయం చేసినట్టేనని మంత్రి విమర్శించారు.
Read More :
SCR | ఆగస్టు 5 నుంచి 10 వరకు ఆ రెండు ఎక్స్‌ప్రెస్‌ల రద్దు.. ఎందుకంటే?