Land grab : కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరు (Bengalore) లో రూ.800 కోట్ల విలువైన 108 ఎకరాల భూమిని కాంగ్రెస్ ఎమ్మెల్యే (Congress MLA) హెచ్‌సీ బాలకృష్ణ (HC Balakrishna) కబ్జా చేశారని బీజేపీ నేత (BJP Leader) ఎన్ఆర్ రమేశ్ (NR Ramesh) లోకాయుక్త (Lokayukta) కు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే బాలకృష్ణ సన్నిహితుడు యశ్వంత్‌పూర్ ఎమ్మెల్యే (Yashwathpur MLA) ఎస్టీ సోమశేఖర్ (ST Somashekar), పలువురు ప్రభుత్వ అధికారులకు ఈ కబ్జాలో హస్తం ఉందని రమేశ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
రమేశ్ లోకాయుక్తకు చేసిన ఫిర్యాదు ప్రకారం.. బెంగళూరు సౌత్ తాలూకాలోని తవరెకేరె హొబ్లిలోని సర్వే నంబర్లు 233, 234, 235, 236లలో గల 108 ఎకరాల భూమి కబ్జాకు గురైంది. అందులో రూ.165 కోట్ల విలువచేసే 26 ఎకరాల భూమిలో ఇప్పటికే నిర్మాణాలు కూడా పూర్తయ్యాయి. రూ.54 కోట్ల విలువచేసే మరో 8 ఎకరాల భూమిని ఎమ్మెల్యే హెచ్‌సీ బాలకృష్ణ సతీమణి రాధాబాలకృష్ణ పేరు మీదకు బదిలీ చేశారు.
అయితే ఆ భూమిని నేరుగా కాకుండా ముందుగా ఫోర్జరీ డాక్యుమెంట్లతో థర్డ్ పార్టీ పేరు మీద రిజస్టర్ చేశారు. ఆ తర్వాత దాన్ని రాధా బాలకృష్ణ పేరు మీదకు ట్రాన్స్ఫర్ చేశారు. కెంగెరి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈ ఏడాది ఏప్రిల్ 3న ఈ రిజిస్ట్రేషన్ జరిగింది. యశ్వంత్‌పూర్ నియోజకవర్గం కురుబరహల్లి గ్రామంలోని 158 సర్వే నంబర్లో మరికొంత భూమి కబ్జాకు గురైంది. మొత్తం 130.29 ఎకరాల ఈ భూమి విలువ రూ.800 కోట్లు ఉంటుంది. అంటే అక్కడ ఒక్కో ఎకరా రూ.6 కోట్ల చొప్పున పలుకుతోంది.