Health tips | వానాకాలం ఆ సమస్యలు వేధిస్తున్నాయా.. వేపతో చక్కటి పరిష్కారం..!
Health tips | మన దేశంలోని సాంప్రదాయక వైద్య విధానాల్లో వేపకు చాలా ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా వానాకాలంలో సంక్రమించే చర్మ సంబంధితమైన సమస్యలకు వేపకు మించిన పరిష్కారం లేదని నిపుణులు చెబుతున్నారు. వేప నూనె (Neem oil) , వేప ఆకులు (Neem leaves), వేప పసరు (Neem liquid) ఇలా ఎన్నో రకాలుగా వేపను సమస్యల పరిష్కారానికి వినియోగించవచ్చు.
Health tips : మన దేశంలోని సాంప్రదాయక వైద్య విధానాల్లో వేపకు చాలా ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా వానాకాలంలో సంక్రమించే చర్మ సంబంధితమైన సమస్యల (Skin problems) కు వేపకు మించిన పరిష్కారం లేదని నిపుణులు చెబుతున్నారు. వేప నూనె (Neem oil) , వేప ఆకులు (Neem leaves), వేప పసరు (Neem liquid) ఇలా ఎన్నో రకాలుగా వేపను సమస్యల పరిష్కారానికి వినియోగించవచ్చు. వేపలో నింబిడిన్, అజాడిరెక్టిన్, ఫ్లేవనాయిడ్స్ లాంటి బయోయాక్టివ్ రసాయనాలు ఉన్నాయి. వీటి కారణంగా ఫంగల్, బ్యాక్టీరియల్ వ్యాధులతోపాటు ఇన్ఫ్లమేషన్ నుంచి కూడా రక్షణ లభిస్తుంది.
వానాకాలంలో గాల్లో తేమ ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా చర్మ సంబంధిత సమస్యలు మొదలవుతాయి. వీటికి వేప చక్కని పరిష్కారం చూపుతుంది. వాతావరణంలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు చెమట ఎక్కువగా ఉత్పత్తి అయ్యి చర్మ రంధ్రాలు మలినాలతో పూడుకుపోతాయి. అది చివరకు బ్లాక్ హెడ్స్, పింపుల్స్ వంటి సమస్యలకు దారి తీస్తుంది. వేపలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాల కారణంగా బ్యాక్టీరియా ఇబ్బంది తొలగి చర్మానికి స్వాంతన దొరుకుతుందని నిపుణులు చెబుతున్నారు.
చర్మంపై తెల్లని పొట్టు రేగడాన్ని ఎగ్జీమా అంటారు. ఈ సమస్య ఉన్న వారిని దురద కూడా వేధిస్తుంది. వానా కాలంలో ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. వేపలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎగ్జీమా నుంచి ఉపశమనం కలిగిస్తాయని హెల్త్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఫైటో కాంపౌండ్స్, ఫ్లేవనాయిడ్స్, అజాడిరాడియోన్ కాంపౌండ్స్ ఎగ్జీమా తీవ్రం కాకుండా నిరోధిస్తాయని అంటున్నారు.
సోరియాసిస్ ఉన్న వారిలో చర్మంపై పొలుసులతో కూడిన ఎర్రటి ప్యాచెస్ ఏర్పడతాయి. దురద కూడా పెరుగుతుంది. వానాకాలంలో గాల్లోని తేమ కారణంగా సమస్య మరింత తీవ్రమవుతుంది. అయితే వేప పసరు చర్మానికి రాసుకుంటే సోరియాసిస్ నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. వేప నూనెలో గాయాలను త్వరగా మానేలా చేసే గుణం కూడా ఉందని తెలుపుతున్నారు.
అదేవిధంగా వానాకాలంలో అథ్లెట్స్ ఫూట్, రింగ్ వార్మ్, కాండిడియాసిస్ వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్లు కూడా ఎక్కువవుతాయి. అయితే వేపలోని యాంటీఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఈ సమస్యలకు సులువుగా చెక్ పెడతాయి. ఫంగస్ పెరుగుదలను అడ్డుకుని వ్యాధులను నిరోధిస్తాయి. కాబట్టి ఈ కాలంలో వచ్చే అనేక సమస్యలకు వేప మంచి పరిష్కారమని నిపుణులు సూచిస్తున్నారు.
Read More >>
ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసం ఎలక్టోరల్ కాలేజ్ సిద్ధం : కేంద్ర ఎన్నికల సంఘం
ఉగ్రవాదం ఎన్నడూ కాషాయం కాలేదు, కాదు, కాబోదు : దేవేంద్ర ఫడ్నవీస్
దేశంలోని 10 రాష్ట్రాల్లో 41 బర్డ్ ఫ్లూ కేసులు.. రాజ్యసభకు కేంద్రం లిఖితపూర్వక సమాధానం
ఆగస్టు 4 నుంచి భారత్లో ఫిలిప్పైన్స్ అధ్యక్షుడి పర్యటన
ధర్మస్థల మిస్టరీపై ముమ్మరంగా దర్యాప్తు.. తవ్వకాల్లో బయటపడ్డ ఎముకలు
ఢిల్లీ పోలీస్ కమిషనర్గా హోంగార్డ్స్ డీజీకి అదనపు బాధ్యతలు
దారుణం.. చేతిరాత సరిగా లేదని క్యాండిల్తో బాలుడి చేయి కాల్చిన టీచర్
పుట్టినరోజు నాడే కత్తులతో పొడిచి యువకుడి దారుణ హత్య..!
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

