Snake | పాము (Snake) కాటుకు గురైన ఓ వ్యక్తి.. ఏకంగా ఆ పామును మెడలో వేసుకొని చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చాడు. ఈ ఘటన బీహార్ (Bihar) రాష్ట్రం భగల్పూర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
జిల్లాకు చెందిన మీరాచక్ ప్రాంతవాసి ప్రకాశ్ మండల్‌ను అత్యంత విషపూరితమైన (venomous snake) పాము కాటేసింది. దీంతో ప్రకాశ్.. ఆ పామును పట్టుకుని మెడలో వేసుకొని చికిత్స కోసం స్థానిక జవహర్లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి వచ్చాడు. ఎమర్జెన్సీ విభాగం వద్దకు వెళ్లాడు. అతడిని చూసిన వైద్యులు, స్థానికులు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అనంతరం సదరు వ్యక్తి పామును చేత్తో గట్టిగా పట్టుకొనే కుప్పకూలి పడిపోయాడు. వైద్యులు, ఇతర సిబ్బంది అతి కష్టం మీద పామును ఓ సంచిలో బంధించి.. ఆ వ్యక్తికి వైద్యం అందించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సమాచారం.
अजब गजब : डाक्टर को विश्वास दिलाने के लिए
एक शख्स सांप को पकड़कर अपने साथ अस्पताल ले आया.दरअसल इस सांप ने शख्स को काट लिया था.#snake pic.twitter.com/oQI7uxM5r8— सूर्यरेखा (@suryarekha_in) October 16, 2024
Also Read..
Spurious Liquor | బీహార్‌లో కల్తీమద్యం తాగి 24 మంది మృతి
TTD | భక్తులకు అలర్ట్.. శ్రీవారి మెట్టు నడక మార్గం బంద్
Pushpa 2 The Rule | అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్‌లో యానిమల్ యాక్టర్.. ఇంతకీ పాత్ర ఏంటో మరి..?