Pushpa 2 The Rule | టాలీవుడ్ స్టార్ యాక్టర్ అల్లు అర్జున్ (Allu Arjun) కాంపౌండ్ నుంచి వస్తోన్న ప్రాంచైజీ ప్రాజెక్ట్ పుష్ప 2 ది రూల్ (Pushpa 2 The Rule). సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. కన్నడ భామ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని 2024 డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారని తెలిసిందే.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి ఫొటోల రూపంలో బయటకు వచ్చింది. ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టింగ్ కోచ్, నటుడు సౌరభ్ సచ్దేవ కూడా నటిస్తున్నాడు. ఈ విషయాన్ని బ్రహ్మాజీ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశాడు. Sacred Games, Animal సినిమాలతో ప్రేక్షకులను పలుకరించిన సౌరభ్ పుష్ప 2 భాగమవడంతో.. అతడి పాత్ర ఎలా ఉండబోతుందోనని ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు అభిమానులు.
ఫస్ట్ పార్టుకు అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఆల్బమ్ అందించిన రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సీక్వెల్‌కు కూడా పనిచేస్తు్ండటంతో అంచనాలు పెరిగిపోతున్నాయి. సీక్వెల్లో ఫహద్ ఫాసిల్, జగదీష్ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్, ధనంజయ, షణ్ముఖ్, అజయ్, శ్రీతేజ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Rakul Preet Singh | వెన్ను నొప్పిని లెక్కచేయలే.. ఆరు రోజులుగా బెడ్పైనేనన్న రకుల్ ప్రీత్ సింగ్
Matka | కూల్ స్పాట్ క్లబ్ చూశారా..? వరుణ్ తేజ్ టీం నుంచి మట్కా నయా గ్లింప్స్