పాట్నా: బీహార్ సీఎం నితీశ్ కుమార్ (Nitish Kumar) మరో పొరపాటు చేశారు. వేదికపై ఉన్న ప్రధాని పేరును ఆయన మరిచిపోయారు. మోదీని అటల్ బిహారీ వాజ్పేయి అని పిలిచారు. దీంతో సభకు హాజరైన వారు ఇది విని షాక్ అయ్యారు. శుక్రవారం కరకట్లో జరిగిన బహిరంగ సభలో సీఎం నితీశ్ కుమార్ మాట్లాడారు. వేదికపై ఉన్న ప్రధాని మోదీ పేరు చెప్పడానికి ఆయన తడబడ్డారు. మోదీని అటల్ బిహారీ వాజ్పేయి అని సంభోదించారు. ఆ వెంటనే తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించారు. ‘అటల్ బిహారీ వాజ్పేయి గతంలో అభివృద్ధి పనులు చేశారు’ అని అన్నారు. జనం పైకి లేచి ప్రధానిని అభినందించాలని ఆయన కోరారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, జనవరిలో కూడా నితీశ్ కుమార్ వింతగా ప్రవర్తించారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా జరిగిన నివాళి కార్యక్రమంలో అకస్మాత్తుగా చప్పట్లు కొట్టారు. అలాగే మార్చిలో పాట్నాలో జరిగిన క్రీడా కార్యక్రమంలో జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో నితీశ్ కుమార్ నవ్వడంతోపాటు పక్కనున్న వారితో మాట్లాడారు. ఈ వీడియో క్లిప్స్ గతంలో వైరల్ అయ్యాయి.
बिहार : काराकाट में CM नीतीश कुमार मंच पर भूले PM मोदी का नाम
◆ वीडियो हुआ SM पर वायरल#PMModiInBihar | #NitishKumar | PM Modi | Bihar News | #BiharThanksModiji pic.twitter.com/K1ibDi6ZDA
— News24 (@news24tvchannel) May 30, 2025
Bihar CM Nitish Kumar starts clapping after paying tributes to MK Gandhi.
Assembly Speaker Nand Kishore Yadav signals him to stop. pic.twitter.com/PeQvlrAW6f
— News Arena India (@NewsArenaIndia) January 30, 2025
Also Read: