లక్నో: ప్రభుత్వ ఆసుపత్రిలో కరెంట్ లేకపోవడంతో అంధకారం నెలకొన్నది. జనరేటర్ ఉన్నప్పటికీ దానిని వినియోగించలేదు. దీంతో మొబైల్ ఫోన్స్‌లోని టార్చ్‌లైట్ వెలుగులో నలుగురు మహిళలకు ప్రసవం జరిగింది. (Women Deliver Under Phone’s Light) ఈ విషయం బయటపడటంతో దర్యాప్తునకు ఆదేశించారు. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బెరువార్బరిలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో సోమవారం రాత్రి నిండు గర్భిణీలైన నలుగురు మహిళలు మొబైల్ ఫోన్ల వెలుగులో శిశువులకు జన్మనిచ్చారు.
కాగా, ఈ సంఘటనపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ స్పందించారు. ఈ సంఘటనపై దర్యాప్తు కోసం ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బెరువార్బరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ట్రాన్స్ఫార్మర్ మూడు రోజుల కిందట కాలిపోయిందని చెప్పారు. అయితే ఆరోగ్య కేంద్రంలో జనరేటర్, డీజిల్ అందుబాటులో ఉన్నప్పటికీ ఇలా జరిగిందని అన్నారు. దర్యాప్తు నివేదిక అందిన తర్వాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చీఫ్ మెడికల్ ఆఫీసర్ హామీ ఇచ్చారు.
Also Read: