శ్రీనగర్: బోర్డర్ సెక్యూర్టీ ఫోర్స్‌పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) ప్రశంసలు కురిపించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో బీఎస్ఎఫ్ దళాలు.. పాకిస్థాన్‌కు చెందిన 118 ఫార్వర్డ్ పోస్టులను, వాటి నిఘా వ్యవస్థలను ధ్వంసం చేసినట్లు మంత్రి చెప్పారు. పొరుగు దేశానికి బీఎస్ఎఫ్ గట్టి జవాబు ఇచ్చిందన్నారు. అమర్నాథ్ యాత్ర ప్రిపరేషన్ గురించి జమ్మూకశ్మీర్‌లో రెండు రోజుల పర్యటన చేపట్టిన ఆయన ఇవాళ మాట్లాడుతూ.. పాకిస్థాన్ దూకుడుకు బీఎస్ఎఫ్ దళాలు బలమైన ప్రతిస్పందన ఇచ్చాయన్నారు. తక్కువ సమయంలోనే అధిక సంఖ్యలో ఫార్వర్డ్ పోస్టులను ధ్వంసం చేయడం అసాధరణమైన పని అని పేర్కొన్నారు. పాకిస్థాన్ కోలుకవడానికి చాలా ఏండ్లు పడుతుందన్నారు. ఒక్కొక్కటిగా ఆ దేశ నిఘా వ్యవస్థను నిర్వీర్యం చేసినట్లు చెప్పారు. కనీసం ఆ దేశానికి కోలుకునేందుకు నాలుగైదు ఏండ్ల సమయం పడుతుందన్నారు.