ముంబై: మహారాష్ట్ర పూణేలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీయే) చరిత్ర సృష్టించింది. తొలి బ్యాచ్‌కు చెందిన 17 మంది మహిళా క్యాడెట్స్ పట్టభద్రులయ్యారు. (Women Cadets Graduate From NDA) శుక్రవారం జరిగిన పాస్అవుట్ పరేడ్‌లో 300 మందికి పైగా పురుష క్యాడెట్లతో కలిసి వీరు పాల్గొన్నారు. త్రివిధ దళాల్లో అధికారులుగా సేవలందించనున్నారు.
కాగా, మిజోరాం గవర్నర్, మాజీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (సీవోఏఎస్) జనరల్ విజయ్ కుమార్ సింగ్ (రిటైర్డ్) పాసింగ్ అవుట్ పరేడ్‌కు సమీక్షా అధికారిగా వ్యవహరించారు. ఇది చాలా ముఖ్యమైన, చారిత్రాత్మకమై పాస్అవుట్ పరేడ్ అని ఆయన అభివర్ణించారు. తొలి బ్యాచ్‌కు చెందిన 17 మంది మహిళా క్యాడెట్ల విజయాన్ని ప్రశంసించారు. ‘ఈ రోజు అకాడమీ చరిత్రలో ఒక ప్రత్యేకమైన ముఖ్యమైన రోజు. ఎన్డీయే నుంచి మొదటి బ్యాచ్ మహిళా క్యాడెట్లు బయటకు వచ్చారు. మహిళా సాధికారత, సమిష్టి ప్రయాణంలో చారిత్రాత్మక మైలురాయిని ఇది సూచిస్తుంది’ అని అన్నారు.
మరోవైపు మహిళా అభ్యర్థులకు డిఫెన్స్ అకాడమీ తలుపులు తెరవడానికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)కు సుప్రీంకోర్టు అనుమతించింది. 2021లో ఈ మేరకు చారిత్రక ఆదేశాన్ని జారీ చేసింది. దీంతో 2022లో మహిళా క్యాడెట్ల మొదటి బ్యాచ్ ఎన్డీయే 148వ కోర్సులో చేరారు. కోర్సు విజయవంతంగా పూర్తి చేసిన మహిళా క్యాడెట్స్ పురుషులతో సమానంగా త్రివిధ దళాధికారులుగా దేశానికి సేవలందించనున్నారు.
#WATCH | Pune, Maharashtra | General VK Singh, PVSM, AVSM, YSM (Retd) says, “Today is also a uniquely significant day in the history of the academy, the first batch of female cadets pass out from NDA today. This marks a historic milestone in our collective journey towards… https://t.co/Q1mwicI7Og pic.twitter.com/E26SxZZo2I
— ANI (@ANI) May 30, 2025
Also Read: