Bayya Sunny Yadav | హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): ప్రముఖ తెలుగు యూట్యూబర్ భయ్య సన్నీ యాదవ్ (బీఎస్‌వై)ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు చెన్నై ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఇటీవల హైదరాబాద్ నుంచి పాకిస్థాన్‌లోని కరాచీకి సన్నీ యాదవ్ బైక్‌పై వెళ్లాడు.ఆపరేషన్ సిందూర్ తర్వాత అతను బైక్‌పై పాకిస్థాన్ వెళ్లడం కలకలం రేపింది.
భయ్యా సన్నీ యాదవ్ పాకిస్థాన్‌కు ఏదైనా సమాచారం చేరవేసాడా అనే కోణంలో ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నట్లు తెలిసింది. కాగా, బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన కేసుల్లో యాదవ్‌పై సూర్యాపేట జిల్లాలో ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది.