Shashi Tharoor | ఉగ్రవాదుల మృతికి సంతాపమా..? కొలంబియా ప్రభుత్వ వైఖరి పట్ల శశిథరూర్ అసహనం
Shashi Tharoor | పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) చేపట్టిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో అనేక మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే, మరణించిన ఉగ్రవాదులపట్ల కొలంబియా (Colombia) ప్రభుత్వం సంతాపం తెలపడంపై కాంగ్రెస్ ఎంపీ (Congress MP) శశిథరూర్ (Shashi Tharoor) అసంతృప్తి వ్యక్తం చేశారు.
Shashi Tharoor | పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) చేపట్టిన విషయం తెలిసిందే. పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా దాడులు చేసింది. ఈ దాడుల్లో అనేక మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే, మరణించిన ఉగ్రవాదులపట్ల కొలంబియా (Colombia) ప్రభుత్వం సంతాపం తెలపడంపై కాంగ్రెస్ ఎంపీ (Congress MP) శశిథరూర్ (Shashi Tharoor) అసంతృప్తి వ్యక్తం చేశారు.
పాకిస్థాన్ సీమాంతర ఉగ్రవాదంపై తాము జరుపుతున్న పోరు గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు భారత్ మొత్తం ఏడు అఖిలపక్ష దౌత్య బృందాలను ఏర్పాటు చేసిన విషయం విదితమే. భారత పార్లమెంట్ అఖిలపక్ష ప్రతినిధి బృందాలు వివిధ దేశాల్లో పర్యటిస్తున్నాయి. ఇందులో భాగంగా కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నేతృత్వంలోని బృందం ప్రస్తుతం కొలంబియాలో పర్యటిస్తోంది. ఈ సందర్భంగా థరూర్ అక్కడ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కొలంబియా ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేశారు.
ఉగ్రవాద దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన భారత పౌరుల పట్ల కనీస సానుభూతి వ్యక్తం చేయకపోగా.. భారత్ దాడుల తర్వాత పాక్‌లో చనిపోయినవారికి మాత్రమే సంతాపం తెలిపిన కొలంబియా ప్రభుత్వ వైఖరి తీవ్రంగా నిరాశపరిచిందని వ్యాఖ్యానించారు. ఆపరేషన్ సిందూర్‌కు దారితీసిన పరిస్థితులు, భారత్ తీసుకున్న చర్యలను కొలంబియా అధికారులకు వివరించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు శశిథరూర్ స్పష్టం చేశారు.
దాదాపు నాలుగు దశాబ్దాలుగా భారత్ అనేక దాడులను భరించిందని ఈ సందర్భంగా శశిథరూర్ గుర్తు చేశారు. పాక్ తన సైనిక పరికరాలను రక్షణ కోసం కాకుండా.. పక్క దేశాలపై దాడి చేసేందుకు వినియోగిస్తోందని మండిపడ్డారు. ఉగ్రదాడికి వ్యతిరేకంగా మాత్రమే భారత్ విధానాలు ఉంటాయని ఈ సందర్భంగా శశిథరూర్ స్పష్టం చేశారు. పహల్గాం దాడి వెనక పాక్ ప్రాయోజిత ఉగ్రవాదం ఉందనడానికి భారత్ వద్ద కచ్చితమైన ఆధారాలున్నాయని వెల్లడించారు. పాక్‌లో వినియోగంలో ఉన్న రక్షణ పరికరాల్లో దాదాపు 81శాతం చైనా నుంచి దిగుమతి చేసుకున్నవేనని తెలిపారు. ఇదే విషయాన్ని తాము అంతర్జాతీయ వేదికలపై కూడా ప్రస్తావించనున్నట్లు థరూర్ వెల్లడించారు.
Also Read..
ISI Spy | పాక్‌లో 90 రోజులు ఉన్నాడు.. సిమ్ కార్డులు దుర్వినియోగం చేశాడు.. పోలీసులకు చిక్కాడు
Deportation | అమెరికా నుంచి ఈ ఏడాది 1,100 మంది భారతీయుల బహిష్కరణ
Indian Students | యూఎస్‌కి దారేదీ?.. ట్రంప్ నిర్ణయాలతో భారతీయ విద్యార్థులకు తప్పని ఇబ్బందులు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
The Paradise | విమర్శలు ఎదురైన తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్‌గా ‘ది ప్యారడైజ్’, నాని ఖాతాలో మరో రికార్డు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

