Bhupinder Singh Hooda : రాబోయే రోజుల్లో హరియాణ ప్రజలు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని ఆ రాష్ట్ర మాజీ సీఎం, కాంగ్రెస్ నేత భూపీందర్ సింగ్ హుడా అన్నారు. కర్నాల్‌లో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ప్రతికూల ఫలితాలు ఎదురయ్యాయని చెప్పారు.
బీజేపీ రాజ్యాంగాన్ని మార్చుతుందని తాము ఎలాంటి తప్పుడు వదంతులను వ్యాప్తి చేయలేదని, ఈ విషయాన్ని బీజేపీ నేతలే వెల్లడించారని అన్నారు. ప్రజల్లో మార్పు మొదలైందని, బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని అన్నారు. హరియాణలో త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Read More :
Pawan Kalyan Pen | పవన్ కళ్యాణ్‌కు సురేఖ ఇచ్చిన పెన్ ధర ఎంతో తెలుసా.?