Pawan Kalyan Pen | ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు తన వదిన చిరంజీవి సతీమణి సురేఖ అత్యంత ఖరీదైన మోంట్‌బ్లాంక్ పెన్నును బహుమతిగా ఇచ్చిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన వీడియోను కూడా చిరంజీవి ఎక్స్ వేదికగా పంచుకున్నాడు. అయితే పవన్‌కు మోంట్‌బ్లాంక్ పెన్ బహుమతిగా ఇచ్చిన అనంతరం ఈ పెన్ ధర ఎంత ఉంటుంది అని నెటిజన్లు వెతకడం మొదలుపెట్టారు. కొందరూ ఈ పెన్ రూ. 1.5 లక్షల ఉంది అనగా మరికొందరూ రూ.2.60 లక్షల వరకు ఉంటుందని కామెంట్స్ చేశారు. అయితే ఈ పెన్ ధర ఎంత ఉంటుంది అని మోంట్‌బ్లాంక్ వెబ్సైట్ చూసిన ప్రేక్షకులకు మైండ్ బ్లాక్ అయినంత పని అయింది. ఈ పెన్ అసలు ధర చూస్తే.. రూ.3,50 లక్షలు ఉన్నట్లు తెలిసింది. దీంతో సినిమాలో అయిన రాజకీయల్లో అయిన పవన్ కళ్యాణ్ రేంజ్ వేరు అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన పవన్ కళ్యాణ్.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, చంద్రబాబు క్యాబినెట్లో పంచాయతీరాజ్ సహా కీలక శాఖలకు మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.