Saree Theft | కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru)లో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఓ దుకాణంలో చీరలు దొంగిలించిందన్న (Saree Theft) కారణంతో మహిళను (woman accused) షాప్ యజమాని నడి రోడ్డుపైకి ఈడ్చుకొచ్చి దారుణంగా కొట్టాడు. కాళ్లతో తంతూ దూషించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
బెంగళూరు అవెన్యూ రోడ్డులోని మాయా సిల్క్స్ శారీస్ (Maya Silk Sarees) అనే దుకాణంలోకి ఈ నెల 20న ఓ మహిళ వెళ్లింది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో దుకాణంలోకి వెళ్లిన ఆమె అక్కడున్న దాదాపు రూ.91,500 విలువైన 61 చీరలు ఉన్న కట్టను దొంగలించింది. ఆమె చీరలను దొంగలిస్తున్నట్లు దుకాణంలోని సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డైంది. దీంతో దుకాణం యజమాని సదరు మహిళపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడి ఫిర్యాదు మేరకు సిటీ మార్కెట్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆ తర్వాతి రోజు సదరు మహిళ మళ్లీ ఆ దుకాణం వైపు వచ్చింది. దీంతో షాపు యజమాని తన సిబ్బందితో కలిసి సదరు మహిళపై దాడి చేశారు. రోడ్డుపైకి ఈడ్చుకొచ్చి చితకబాదారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. సదరు మహిళను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. దొంగిలించిన చీరలను స్వాధీనం చేసుకున్నారు. వైరలవుతున్న వీడియోపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అధికారుల నిర్లక్ష్యంపై కన్నడ అనుకూల కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో మహిళపై దాడికి పాల్పడిన దుకాణం యజమాని, సిబ్బందిని అరెస్ట్ చేశారు.
ಅವೆನ್ಯೂ ರಸ್ತೆಯಲ್ಲಿ ಹೇಳೋರು ಕೇಳೋರು ಯಾರು ಇಲ್ಲ ಅನ್ನೋ ಆಗಿದೆ.. 😡
ಇವರದೇ ದರ್ಬಾರ್..
ಮಾರ್ವಾಡಿಗಳ ದಬ್ಬಾಳಿಕೆ ನೋಡಿ.. 😡
ಬಾಬುಲಾಲ್ ಅನ್ನೋ ಇವನ ಮೇಲೆ ಕ್ರಮ ಆಗಲಿ..
ಈ ರೀತಿ ಅಸಹಾಯಕ ಹೆಣ್ಣುಮಗಳ ಮೇಲೆ ಶೂ ಕಾಲಲ್ಲಿ ಒದ್ದು ದೌರ್ಜನ್ಯ..
ಕೂಡಲೇ ಇವನ ಬಂಧನ ಆಗಲೇಬೇಕು..@BlrCityPolice @cottonpeteps pic.twitter.com/wolUNbM7Gi— ರೂಪೇಶ್ ರಾಜಣ್ಣ(RUPESH RAJANNA) (@rajanna_rupesh) September 25, 2025
Also Read..
Benjamin Netanyahu | అరెస్ట్ భయం.. అమెరికా వెళ్లేటప్పుడు ఇజ్రాయెల్ ప్రధాని ఏం చేశారంటే..!
Pakistan PM | ట్రంప్‌తో పాక్ ప్రధాని షరీఫ్ భేటీ.. మీడియాకు నో ఎంట్రీ