Benjamin Netanyahu | ఇజ్రాయెల్ ప్రధాని (Israeli PM) బెంజిమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) చేసిన ఓ పని ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ (UNGA) సమావేశాలకు హాజరయ్యేందుకు ఆయన అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఆయన తన ప్రయాణంలో యూరప్ గగనగలం (European airspace) కాకుండా.. సుదీర్ఘ మార్గంలో ప్రయాణించి యూఎస్ చేరుకోవడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకే (Avoid Arrest) ఆయన ఇలా చేసినట్లు తెలుస్తోంది.
హమాస్ అంతమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగిస్తోన్న విషయం తెలిసిందే. ఈ యుద్ధం (Israel Gaza War) నేపథ్యంలో నెతన్యాహుపై 2024 నవంబరులో అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (International Criminal Court) అరెస్టు వారెంట్ జారీ చేసింది. దీంతో ఐసీసీ సభ్యదేశాల్లోకి అడుగుపెడితే ఆయన్ని అరెస్టు చేసే అవకాశం ఉంది. ఐసీసీలో ఐరోపా దేశాలు సభ్యులుగా ఉన్నాయి. అమెరికా వెళ్లాలంటే యూరప్ గగనతలం మీదుగానే వెళ్లాల్సి ఉంటుంది. దీంతో అరెస్ట్ భయంతో నెతన్యాహు ప్రత్యామ్నాయ మార్గంలో (Unusual Route) అమెరికా చేరుకున్నారు.
ఫ్లైట్ ట్రాకింగ్ డాటా ప్రకారం.. ఇజ్రాయెల్ ప్రధాని అధికారిక విమానం ‘వింగ్స్ ఆఫ్ జియాన్’ (Wings of Zion) గ్రీస్, ఇటలీ శివారు ప్రాంతాల పైనుంచి మధ్యధరా సముద్రం దాటి అక్కడినుంచి జిబ్రాల్టార్ ద్వారం.. అట్లాంటిక్ మీదుగా న్యూయార్క్‌కు చేరుకుంది. దీని కారణంగా సాధారణ మార్గం కంటే 373 మైళ్లు ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వచ్చింది. చాలా సమయం కూడా పట్టింది. ఇప్పుడు ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Also Read..
Pakistan PM | ట్రంప్‌తో పాక్ ప్రధాని షరీఫ్ భేటీ.. మీడియాకు నో ఎంట్రీ
Trump Tariffs | మరోసారి సుంకాలతో విరుచుకుపడిన ట్రంప్.. ఫార్మా దిగుమతులపై 100 శాతం టారీఫ్