Pakistan PM | భారత్‌తో ఉద్రిక్తతల వేళ దాయాది పాకిస్థాన్ (Pakistan), అగ్రరాజ్యం అమెరికా మధ్య స్నేహం బలపడుతోంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ (Asim Munir) రెండుసార్లు అమెరికాలో పర్యటించిన విషయం తెలిసిందే. తాజాగా పాక్ ప్రధాని (Pakistan PM) షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) యూఎస్ వెళ్లారు. ఈ సందర్భంగా శ్వేతసౌధంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)తో భేటీ అయ్యారు. షరీఫ్ వెంట ఆర్మీ చీఫ్ కూడా ఉన్నారు.
అమెరికా కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం 4.52 గంటలకు పాక్ ప్రధాని షరీఫ్ వైట్‌హౌస్‌కు చేరుకున్నారు. అక్కడ సీనియర్ అధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వైట్‌హౌస్‌లోని ఓవల్ ఆఫీసులో ట్రంప్‌తో భేటీ అయ్యారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ మీటింగ్‌కు మీడియాను అనుమతించకపోవడం గమనార్హం. అంతకుముందు మీడియాతో మాట్లాడిన ట్రంప్.. పాక్ ప్రధాని గురించి ప్రస్తావించారు. పాక్ ప్రధానిని గొప్ప నాయకుడు అంటూ ప్రశంసించారు. ట్రంప్‌తో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భేటీ కావడం ఇదే తొలిసారి.
Also Read..
Trump Tariffs | మరోసారి సుంకాలతో విరుచుకుపడిన ట్రంప్.. ఫార్మా దిగుమతులపై 100 శాతం టారీఫ్
Watch: పార్కింగ్ ప్రాంతంలో ఎలుగుబంటి దాడి.. తర్వాత ఏం జరిగిందంటే?
Cancer Deaths: రానున్న 25 ఏళ్లలో.. 75 శాతం పెరగనున్న క్యాన్సర్ మరణాలు