న్యూఢిల్లీ: రాబోయే 25 ఏళ్లలో క్యాన్సర్ మరణాలు(Cancer Deaths) 75 శాతం పెరగనున్నట్లు ద లాన్సట్ జర్నల్ తన నివేదికలో పేర్కొన్నది. ఆ మరణాల సంఖ్య 18.6 మిలియన్లుగా ఉండనున్నది. వయసు మీదపడిన జనాభా పెరగడం కూడా ఓ కారణంగా భావిస్తూ రిపోర్టు ఇచ్చారు. కొత్త క్యాన్సర్ కేసుల సంఖ్య 61 శాతానికి పెరగనున్నది. 2050 నాటికి కొత్త క్యాన్సర్ కేసుల సంఖ్య 30.5 మిలియన్లుగా ఉండనున్నది. 1990 నుంచి క్యాన్సర్ మృతుల సంఖ్య 74 శాతానికి పెరిగినట్లు పరిశోధకులు అంచనా వేశారు.
దిగువ, మధ్య తరగతి దేశాల్లో కేసుల సంఖ్య అధికంగా ఉన్నట్లు గుర్తించారు. 1990 నుంచి 2023 మధ్య ఇండియాలో క్యాన్సర్ రోగుల సంఖ్య 26.4 శాతం పెరిగినట్లు రిపోర్టు తేల్చింది. ప్రపంచంలోనే ఇది అత్యధిక సంఖ్యగా భావిస్తున్నారు. చైనాలో క్యాన్సర్ కేసుల సంఖ్య 18.5 శాతం పడిపోతున్నట్లు గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా 40 శాతం క్యాన్సర్ మరణాలకు 44 రిస్క్ ఫ్యాక్టర్లు కారణమని పరిశోధకులు భావిస్తున్నారు.
పొగాకు, అనారోగ్యకరమైన ఆహారం, అధిక బ్లడ్ షుగర్ లాంటివి కొన్ని కారణాలని, వీటిని అదుపు చేసుకోవచ్చు అని నివేదికలో తెలిపారు.