Bengaluru | కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru)ను గత రెండు రోజులుగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. సోమవారం ఉదయం కూడా నగరంలో కుండపోత వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షం ఇదే రీతిలో కొనసాగితే లోతట్టు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
మరోవైపు నేడు బెంగళూరులో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఐఎండీ హెచ్చరికలతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలోని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించింది (Schools closed). అదేవిధంగా పలు కంపెనీలు ఉద్యోగులకు వర్క్‌ఫ్రం హోం అవకాశం కల్పించాయి.
#WATCH | Karnataka: Traffic snarls and waterlogging in Bengaluru city this morning, following rainfall here.
A holiday has been announced for anganwadis and schools in Bengaluru City today. pic.twitter.com/d6DA2RjAEP
— ANI (@ANI) October 21, 2024
Also Read..
Karwa Chauth | తొలిసారి కర్వాచౌత్ వేడుకల్లో మెరిసిన రకుల్ ప్రీత్ జంట.. ఫొటోలు వైరల్
Donald Trump | మెక్‌డొనాల్డ్స్‌లో ఫ్రెంచ్ ఫ్రైస్ తయారు చేసిన ట్రంప్.. వీడియో వైరల్