Donald Trump | అధ్యక్ష ఎన్నికలతో (US Elections) అగ్రరాజ్యం అమెరికాలో రాజకీయాలు వేడెక్కాయి. డెమోక్రాట్స్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ కొనసాగుతోంది. గెలుపే లక్ష్యంగా ఇద్దరు అభ్యర్థులూ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నారు.
Fries: BAGGED ✅ pic.twitter.com/oj3T5KSazz
— Trump War Room (@TrumpWarRoom) October 20, 2024
రిపబ్లికన్పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తాజాగా ఓ రెస్టారెంట్లో పనిచేశారు. పెన్సిల్వేనియాలోని మెక్డొనాల్డ్స్(McDonalds) స్టోర్లో ఆదివారం కొద్దిసేపు పని చేశారు. అక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ (franchise) తయారు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం వైరల్గా మారాయి.
It’s called we do a little serving pic.twitter.com/NuHjN0AdVo
— Trump War Room (@TrumpWarRoom) October 20, 2024
నవంబర్ 5న జరగనున్న అధ్యక్ష ఎన్నికల కోసం ఇరు అభ్యర్థులూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంలో భాగంగా యుక్తవయసులో ఉన్నప్పుడు తాను ఓ మెక్డొనాల్డ్స్లో పని చేశానని డెమోక్రాటిక్పార్టీ అభ్యర్థి, ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్.. ఓ మెక్డొనాల్ట్స్ స్టోర్లో పనిచేసి ఈ విధంగా కౌంటర్ ఇచ్చారు.
PRESIDENT TRUMP: “I’ve now worked for 15 minutes more than Kamala” at McDonald’s 🤣 pic.twitter.com/RMeivIPPd0
— Trump War Room (@TrumpWarRoom) October 20, 2024
Also Read..
Brazil Presiden | బాత్రూంలో జారిపడ్డ బ్రెజిల్ అధ్యక్షుడు..
Unlimited Range | ఈవీ రంగంలో అద్భుతం.. ప్రయాణించే కొద్దీ పెరిగే బ్యాటరీ ఎనర్జీ!
Israel | ఉత్తర గాజాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం.. 87 మంది మృతి