Karwa Chauth | జీవిత భాగస్వామి క్షేమాన్ని కోరుతూ మహిళలు కర్వాచౌత్ (Karwa Chauth) వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటారు. ఉదయం నుంచి ఉపవాసం ఉండి.. అమ్మవారికి పూజలు చేసి.. చంద్రుడి దర్శనం అనంతరం కుటుంబసభ్యులు, సన్నిహితులతో కలిసి విందులో పాల్గొంటారు. ఇక పెళ్లి తర్వాత తొలిసారిగా జరుపుకునే ఈ వేడుకలను మహిళలు జీవితాంతం గుర్తుండిపోయేలా సెలబ్రేట్ చేసుకుంటారు.
తాజాగా, బాలీవుడ్ కొత్త జంట రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh), జాకీ భగ్నానీ (Jackky Bhagnani) తమ మొదటి కర్వాచౌత్ వేడుకలను అంతే ఘనంగా జరుపుకున్నారు. ఈ జంట ఈ ఏడాది ఫిబ్రవరి 22వ తేదీన గోవాలో వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. పెళ్లైన తర్వాత ఈ జంటకు ఇది మొదటి కర్వాచౌత్. ఈ వేడుకలను రకుల్ అత్తవారింట్లో భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఫొటోల్లో ఈ జంట సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతూ కనిపించారు. మరోవైపు సొనాక్షి సిన్హా – జహీర్ ఇక్బాల్ ఖాన్ జంట కూడా తొలిసారి కర్వాచౌత్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.
రకుల్-జాకీ భగ్నానీ జంట మాత్రమే కాకుండా కర్వాచౌత్ వేడుకలను బాలీవుడ్ సెలబ్రిటీలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. కత్రినా కైఫ్, శిల్పాశెట్టి, ప్రీతీ జింటా, మౌనీ రాయ్, రవీనా టాండర్, సోనమ్ కపూర్, ప్రియాంకచోప్రా తదితరులు వేడుకలను తమ ఇంట ఘనంగా చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను నెట్టింట షేర్ చేశారు.
Praying for your lambi umar, today and everyday #HappyKarwachauth Mr. Husband Zaheer Iqbal Khan ❤ pic.twitter.com/C4pZVJZhco
— Sonakshi Sinha ᵖᵃʳᵒᵈʸ (@SonakshiSinha_0) October 20, 2024
Also Read..
PM Modi: ప్రపంచానికి భారత్ ఆశాదీపంగా పనిచేస్తోంది: ప్రధాని మోదీ
Donald Trump | మెక్డొనాల్డ్స్లో ఫ్రెంచ్ ఫ్రైస్ తయారు చేసిన ట్రంప్.. వీడియో వైరల్