న్యూఢిల్లీ: వివిధ రకాల సమస్యలతో సతమతం అవుతున్న ప్రపంచానికి భారత్ ఆశను కల్పిస్తోందని ప్రధాని మోదీ(PM Modi) అన్నారు. ఢిల్లీలో ఎన్డీటీవీ నిర్వహిస్తున్న సదస్సులో ఆయన మాట్లాడారు. భారత సర్కారు అసాధారణ రీతిలో పనిచేస్తోందని, ప్రతి రంగంలోనూ వేగం పెంచినట్లు ఆయన చెప్పారు. మూడవ సారి తాము అధికారంలోకి రావడం వల్ల భారత వృద్ధి రేటు వేగంగా జరుగుతున్నట్లు అనేక సంస్థలు అంచనా వేశాయన్నారు.
#WATCH | Delhi: At a summit, PM Narendra Modi says, “… India is taking a lead in giving direction to the global future. The world believes that India is today a companion during difficult times… India does not make ‘taken for granted’ relations… When India moves forward,… pic.twitter.com/g5TdVzaDYQ
— ANI (@ANI) October 21, 2024
డబుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో భారత్‌కు అడ్వాంటేజ్ జరుగుతోందని, ఏఐ టెక్నాలజీతో పాటు ఆస్పిరేషనల్ ఇండియాగా దేశం మారుతోందన్నారు. దేశ ప్రజలు వికసిత్ భారత్ గురించి చర్చిస్తున్నట్లు ఆయన తెలిపారు. జన శక్తితో రాష్ట్ర శక్తి సాధిస్తున్నట్లు ఉందన్నారు. ఊహాజనితంగా సంబంధాలను పెంచుకోబోమని, తమ బంధాలన్నీ నమ్మకం, విశ్వాసం మీద ఆధారపడి ఉంటాయని ప్రధాని మోదీ తెలిపారు.
ప్రజాస్వామ్య విలువలు, డిజిటల్ ఇన్నోవేషన్.. సహజీవనం చేయగలవని భారత్ నిరూపించినట్లు ప్రధాని చెప్పారు. టెక్నాలజీతో సమగ్రత సాధించాలని, కానీ దాన్ని నియంత్రణకు, విభజనకు వాడరాదన్న ఉద్దేశాన్ని భారత్ చూపించినట్లు ప్రధాని తెలిపారు. తమ ప్రభుత్వానికి రెస్ట్ అనేది లేదని, భారత దేశ కలలను నిజం చేసే వరకు విశ్రమించబోమన్నారు.