Water Crisis | బెంగళూరులో వాటర్ ట్యాంకర్ల నిలువు దోపిడీ..! అల్లాడిపోతున్న ప్రజలు
Water Crisis | కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru)లో తాగునీటి సంక్షోభం (protect water ) తీవ్రస్థాయికి చేరుకుంది. కనీస అవసరమైన నీటి కోసం స్థానికులు వాటర్ ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. దీంతో ఇదే అదునుగా కొందరు సొమ్ము చేసుకుంటూ నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు.
Water Crisis | కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru)లో తాగునీటి సంక్షోభం (protect water ) తీవ్రస్థాయికి చేరుకుంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో బోర్‌వెల్స్ ఎండిపోవడంతో తీవ్రమైన నీటి సంక్షోభం నెలకొంది. మార్చిలోనే నీటి కష్టాలు మొదలవడంతో నగర వాసులు అల్లాడిపోతున్నారు. కనీస అవసరమైన నీటి కోసం స్థానికులు వాటర్ ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. దీంతో ఇదే అదునుగా కొందరు సొమ్ము చేసుకుంటూ నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. అనేక ప్రైవేటు వాటర్ ట్యాంకర్లు నీటి పంపిణీ కోసం నివాసితుల నుంచి విపరీతంగా ఛార్జ్ చేస్తున్నారు. గతంలో రూ.600 ఉన్న నీటి ట్యాంకర్ ధరను అమాంతం రూ.2వేలకు పెంచేశారు. కొన్ని ప్రాంతాల్లో అయితే రూ.3వేలు కూడా వసూలు చేస్తున్నారు. ప్రైవేట్ వాటర్ ట్యాంకర్స్ దోపిడితో సామాన్యులు బేంబేలెత్తిపోతున్నారు.
ఈ నేపథ్యంలోనే ట్యాంకర్ల దోపిడీకి చెక్‌పెట్టేందుకు కర్ణాటక ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ట్యాంకర్లకు కచ్చితమైన ధరను నిర్ణయించింది. బెంగళూరు నగరానికి నీటిని సరఫరా చేసేందుకు దాదాపు 200 ప్రైవేటు ట్యాంకర్లను కాంట్రాక్ట్ ప్రాతిపదికను నియమించింది. బీఎండబ్ల్యూఎస్ఎస్‌బీ (బెంగళూర్ నీటి సరఫరా, సీవరేజ్ బోర్డ్) విజ్ఞప్తి మేరకు బెంగళూరు నగర జిల్లా కలెక్టర్ ట్యాంకర్ రేట్లను ప్రామాణికం చేశారు.
ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ ఆపరేటర్లు రవాణా చేసే నీటి పరిణామం, ప్రయాణించిన దూరం ఆధారంగా ధరలను నిర్ణయించారు. కొత్త నిబంధనల ప్రకారం.. 5 కిలోమీటర్ల పరిధి దూరానికి 6 వేల లీటర్ల నీటి ట్యాంకర్ ధర రూ.600గా నిర్ణయించారు. అదేవిధంగా 8 వేల లీటర్ల ట్యాంకర్‌కు రూ.700, 12,000 లీటర్ల ట్యాంకర్ ధర రూ.1,000గా నిర్ణయించారు. 5 కిలోమీటర్ల మించి ప్రయాణిస్తే దూరానికి అనుగుణంగా రేట్లు పెరుగతూ వస్తాయి.
Also Read..
Bill Gates | అంబానీ బాష్‌కు గర్ల్‌ఫ్రెండ్‌తో హాజరైన బిల్‌గేట్స్.. మరోసారి తెరపైకి ప్రేమ వ్యవహారం
PM Modi | శ్రీనగర్‌లో మోదీ.. దూరం నుంచే శంకరాచార్య కొండను చూస్తూ
Rameshwaram Cafe | బెంగళూరు కేఫ్‌లో పేలుడు ఘటన.. మాస్క్, క్యాప్ లేకుండా నిందితుడి ఫొటోలు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

