Bill Gates | అంబానీ బాష్‌కు గర్ల్‌ఫ్రెండ్‌తో హాజరైన బిల్‌గేట్స్.. మరోసారి తెరపైకి ప్రేమ వ్యవహారం
Bill Gates | అంబానీ బాష్‌లో మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్‌గేట్స్ (Bill Gates) ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయన తన గర్ల్‌ఫ్రెండ్ పౌలా హర్డ్‌తో కలిసి హాజరై సందడి చేశారు.
Bill Gates | అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్అంబానీ (Mukesh Ambani) చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల ప్రీ వెడ్డింగ్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. గుజరాత్‌లోని జామ్‌నగర్ (Jamnagar) వేదికగా మూడు రోజుల పాటు జరిగిన ఈ వేడుకలు ఆదివారంతో ముగిశాయి. ఈ వేడుకల్లో బాలీవుడ్, హాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. క్రీడా, పారిశ్రామిక రంగానికి చెందిన ప్రముఖులు కూడా తరలివచ్చారు.
ఇక ఈ వేడుకల్లో మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్‌గేట్స్ (Bill Gates) ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయన తన గర్ల్‌ఫ్రెండ్ పౌలా హర్డ్‌తో కలిసి హాజరై సందడి చేశారు. మూడు రోజులపాటు ఈ వేడుకల్లో జంటగా మెరిశారు. వేడుకలకు సంబంధించిన ఫొటోలను కూడా బిల్‌గేట్స్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. దీంతో పౌలా హర్డ్‌తో బిల్‌గేట్స్ ప్రేమ, రెండో పెళ్లి వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది.
బిల్ గేట్స్ ప్రేమలో పడ్డట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. పౌలా హర్డ్ (Paula Hurd)తో గత కొంతకాలంగా రిలేషన్లో ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది. గతేడాది జనవరిలో ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నీ సందర్భంగా వీరిద్దరూ కలిసే కనిపించారు. ఇద్దరూ పక్కపక్కనే కూర్చొని మ్యాచ్‌ను వీక్షించారు కూడా. దీంతో ఈ అంశం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత కూడా చాలా సందర్భాల్లో వీరిద్దరూ జంటగా దర్శనమిచ్చారు. బిల్ గేట్స్-పౌలా రొమాంటిక్ రిలేషన్షిప్లో ఉన్నారని.. వారిది విడదీయలేని బంధం అని వారిద్దరికీ అత్యంత సన్నిహితుడైన ఓ వ్యక్తి తెలిపారు. దీంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారన్న ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే, ఈ వార్తలపై ఈ జంట ఇప్పటి వరకూ బహిరంగంగా స్పందించలేదు. ఈ క్రమంలో అంబానీ బాష్‌లో ఇద్దరూ జంటగా కనిపించడంతో మరోసారి వీరి రిలేషన్షిప్ హాట్‌టాపిక్ అవుతోంది.
ఎవరీ పౌలా హర్డ్..
టెక్ దిగ్గజం ఒరాకిల్ మాజీ సీఈవో మార్క్ హర్డ్ భార్యనే ఈ పౌలా హర్డ్. క్యాన్సర్‌తో చాలాకాలం పోరాడిన మార్క్ 2019లో మరణించారు. పౌలా హర్డ్ టెక్ ఎగ్జిక్యూటివ్‌గా కూడా పని చేశారు. ప్రస్తుతం ఆమె ఈవెంట్ ప్లానర్‌గా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆమె చాలా చురుకుగా ఉంటున్నారట.
దాదాపు మూడు దశాబ్దాల వివాహ బంధానికి స్వస్తి పలుకుతూ 2021లో విడాకులు తీసుకున్నారు బిల్ గేట్స్-మెలిందా దంపతులు. ఈ ఇద్దరూ 1994లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఏమైందో ఏమోకానీ పెళ్లైన 27 ఏళ్ల తరువాత విడిపోయారు. టాక్స్ ఎగ్గొట్టడం కోసమే విడాకులు తీసుకున్నారంటూ వీళ్లు విడిపోయినపుడు రకరకాల రూమర్స్ వచ్చాయి. అయితే, ప్రస్తుతం వీరిద్దరూ ఎవరి జీవితాల్లో వారు బిజీగా గడుపుతున్నారు.
Also Read..
PM Modi | శ్రీనగర్‌లో మోదీ.. దూరం నుంచే శంకరాచార్య కొండను చూస్తూ
Abhijit Gangopadhyay | బీజేపీలో చేరిన మాజీ జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ్
Bomb Threat | ఢిల్లీ కళాశాలకు బాంబు బెదిరింపులు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

