Abhijit Gangopadhyay | బీజేపీలో చేరిన మాజీ జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ్
Abhijit Gangopadhyay | కలకత్తా హైకోర్టు జడ్జి (Calcutta High Court judge) జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ్ (Abhijit Gangopadhyay) తాజాగా భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరారు.
Abhijit Gangopadhyay | పశ్చిమ బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు కీలక తీర్పులు వెలువరించి ‘ప్రజల న్యాయమూర్తి’గా పేరు పొందిన కలకత్తా హైకోర్టు జడ్జి (Calcutta High Court judge) జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ్ (Abhijit Gangopadhyay) తన పదవి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరారు.
గురువారం ఉదయం కోల్‌కతాలోని సాల్ట్ లేక్ ప్రాంతంలోగల బీజేపీ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ బీజేపీ కండువా కప్పి అభిజిత్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన అనంతరం అభిజిత్ మీడియాతో మాట్లాడారు. కొత్త రంగంలోకి అడుగుపెట్టినట్లు తెలిపారు. బీజేపీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. పార్టీలో ఓ సైనికుడిగా పనిచేస్తా అన్నారు. అవినీతి టీఎంసీ పాలనను రాష్ట్రం నుంచి తరిమికొట్టడమే తమ ప్రధాన లక్ష్యం అని ఈ సందర్భంగా అభిజిత్ వ్యాఖ్యానించారు.
#WATCH | Kolkata, West Bengal | Former Calcutta High Court judge Justice Abhijit Gangopadhyay joins the BJP in the presence of state party chief Sukanta Majumdar, LoP Suvendu Adhikari and others. pic.twitter.com/hOPGX9p33j
— ANI (@ANI) March 7, 2024
కాగా, గంగోపాధ్యాయ్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. బెంగాల్‌లోని తామ్లుక్ నియోజకవర్గం నుంచి ఆయన బీజేపీ టికెట్‌పై పోటీ చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తామ్లుక్ స్థానంలో సాధారణగా తృణమూల్ కాంగ్రెస్ ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. 2009 నుంచి 2016 వరకు ఆ స్థానం నుంచి సువేంధు అధికారి గెలిచారు. ఆ సమయంలో ఆయన్ను సీఎం మమతాకు రైట్‌హ్యాండ్‌గా భావించారు.
Also Read..
PM Modi | శ్రీనగర్‌లో మోదీ.. దూరం నుంచే శంకరాచార్య కొండను చూస్తూ
Bomb Threat | ఢిల్లీ కళాశాలకు బాంబు బెదిరింపులు
Rameshwaram Cafe | బెంగళూరు కేఫ్‌లో పేలుడు ఘటన.. మాస్క్, క్యాప్ లేకుండా నిందితుడి ఫొటోలు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

