Konaseema | పుట్టిన రోజు వేడుకలకు వెళ్లొస్తుండగా రోడ్డు ప్రమాదం.. నలుగురు యువకులు దుర్మరణం
ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ (Konaseema) జిల్లా అమలాపురంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అమలాపురం రూరల్ మండలం భట్నవిల్లి వద్ద లారీని ఆటో ఢీకొట్టింది. దీంతో నలుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.
అమలాపురం: ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ (Konaseema) జిల్లా అమలాపురంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అమలాపురం రూరల్ మండలం భట్నవిల్లి వద్ద లారీని ఆటో ఢీకొట్టింది. దీంతో నలుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికుల సహాయంతో పోలీసులు దవాఖానకు తరలించారు. మృతులను నవీన్(22), జతిన్(26), నల్లి నవీన్(27), అజయ్(18)గా గుర్తించారు.
వారిలో ముగ్గురు మామిడికుదురు మండలం నగరం గ్రామ వాసులుగా, మరొకరు పీ.గన్నవరం మండలం మానేపల్లికి చెందిన వారని చెప్పారు. యానాంలో పుట్టిన రోజు వేడుకలు చేసుకుని పాశర్లపూడికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. డ్రైవర్ మద్యం మత్తులో ఆటోను వేగంగా నడపడంతో వల్లే ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

