Bengaluru Cafe | దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బెంగళూరులోని ప్రముఖ రామేశ్వరం కేఫ్ (Rameshwaram Cafe)లో పేలుడు ఘటనపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (National Investigation Agency)కు అప్పగించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (Ministry of Home Affairs) సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర నిర్ణయంతో పేలుడు ఘటనపై ఎన్ఐఏ తాజాగా కేసు నమోదు చేసింది.
కర్ణాటక రాజధాని బెంగళూరులోని ప్రముఖ రెస్టారెంట్ రామేశ్వరం కేఫ్‌లో శుక్రవారం బాంబ్ బ్లాస్ట్ (Bomb Blast) ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ పేలుడులో మొత్తం 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో మాస్క్, క్యాప్ ధరించిన ఓ వ్యక్తి బస్సులో ప్రయాణించి కేఫ్‌కు వచ్చినట్లు గుర్తించారు. రవ్వ ఇడ్లీని ఆర్డర్ చేసుకొని ఒక దగ్గర కూర్చుని.. పేలుడుకు ముందు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యింది. అతడు తన వెంట తెచ్చుకున్న బ్యాగ్‌లోని బాంబుకు టైమర్ సెట్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే పలువురిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ప్రధాన నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
Also Read..
Himachal Pradesh | హిమాచల్‌లో భారీ హిమపాతం.. జాతీయ రహదారులు సహా 650 రోడ్లు మూసివేత
Nita Ambani | సంప్రదాయ నృత్యంతో ఆకట్టుకున్న నీతా అంబానీ.. VIDEO