Bomb Threat | దేశంలో పలు విమానాలకు బాంబు బెదిరింపుల (Bomb Threat) పర్వం కొనసాగుతోంది. మంగళవారం ఏకంగా పలు సంస్థలకు చెందిన ఏడు విమానాలకు ఇలాంటి బెదిరింపులు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా బెంగళూరు వెళ్తున్న అకాశా ఎయిర్ ఫ్లైట్ (Akasa Air flight), ఢిల్లీకి వస్తున్న ఇండిగో (IndiGo) విమానానికి గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు.
ఆకాశా ఎయిర్‌లైన్ సంస్థకు చెందిన QP 1335 విమానం 184 మంది ప్రయాణికులు, సిబ్బందితో బుధవారం ఢిల్లీ నుంచి బెంగళూరుకు బయల్దేరింది. అయితే, విమానం టేకాఫ్ అయిన వెంటనే బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని తిరిగి ఢిల్లీకి మళ్లించారు. అక్కడ మధ్యాహ్నం 2 గంటలకు సురక్షితంగా ల్యాండ్ చేశారు. అనంతరం విమానంలో అధికారులు తనిఖీలు చేపట్టారు.
Akasa Air flight QP 1335, flying from Delhi to Bengaluru on October 16, 2024, and carrying 174 passengers, 3 infants and 7 crew members on board, received a security alert. The Akasa Air Emergency Response teams are monitoring the situation and have advised the pilot to divert… pic.twitter.com/YTPER9W8hl
— ANI (@ANI) October 16, 2024
మరోవైపు ముంబై నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానానికి కూడా ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. 6E 651 ముంబై నుంచి బయల్దేరగా.. అలర్ట్ వచ్చింది. దీంతో పైలట్ విమానాన్ని అహ్మదాబాద్‌కు దారి మళ్లించారు. అక్కడ విమానం సేఫ్‌గా ల్యాండ్ అయినట్లు ఇండిగో ప్రతినిధి ఒకరు తెలిపారు.
Flight 6E 651, operating from Mumbai to Delhi, was redirected to Ahmedabad due to a security-related alert. The aircraft was isolated, and all passengers were safely disembarked. Ensuring the safety and security of our customers and crew remains paramount in all facets of our… pic.twitter.com/0772O5lQgG
— ANI (@ANI) October 16, 2024
Also Read..
DA | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక.. డీఏ 3 శాతం పెంపు..!
Nayab Singh Saini | శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన నయాబ్ సింగ్ సైనీ.. రేపే సీఎంగా ప్రమాణం
Muda chief | సీఎం సిద్ధరామయ్యపై తీవ్ర ఆరోపణలు.. ముడా చీఫ్ రాజీనామా..!