Nayab Singh Saini | హర్యానా బీజేపీ శాసనసభాపక్ష నేతగా నయాబ్ సింగ్ సైనీ (Nayab Singh Saini) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం పంచకులలోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సైనీని శాసనసభా పక్ష నేతగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. దీంతో రేపు ఆయన (అక్టోబర్ 17) హర్యానా సీఎంగా (Haryana CM) ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఇటీవలే జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 90 స్థానాలకు గానూ బీజేపీ 48 స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ కేవలం 37 సీట్లకే పరిమితమైంది. ఈ ఎన్నికల్లో గెలిచిన ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా కమలం పార్టీకే మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ ముందుకొచ్చింది. ఇక సైనీని రెండోసారి సీఎంగా కొనసాగించేందుకు బీజేపీ అధిష్ఠానం సుముఖత వ్యక్తం చేసింది. శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన సైనీకి హోంమంత్రి అమిత్‌షా, కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, పార్టీ ఎమ్మెల్యేలు శుభాకాంక్షలు తెలిపారు.
#WATCH | Nayab Singh Saini chosen as the leader of Haryana BJP Legislative party; to take oath as Haryana CM for the second time tomorrow, October 17 pic.twitter.com/qnwAvr3DL1
— ANI (@ANI) October 16, 2024
మార్చి నెలలో మనోహర్ లాల్ ఖట్టర్‌ను తప్పించి బీసీ నేత అయిన నయాబ్ సింగ్ సైనీని (Nayab Singh Saini) సీఎం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. గురువారం పంచకులలో ఆ రాష్ట్ర సీఎంగా నయాబ్ సింగ్ సైనీ ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi), పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు కూడా హాజరు కానున్నట్లు తెలుస్తోంది.
Also Read..
KTR | ‘హైడ్రా’ వల్ల హైదరాబాద్‌లో భయానక వాతావరణం.. కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్
Muda chief | సీఎం సిద్ధరామయ్యపై తీవ్ర ఆరోపణలు.. ముడా చీఫ్ రాజీనామా..!
Priyanka Gandhi | వయనాడ్‌లో వెలిసిన ప్రియాంక గాంధీ పోస్టర్లు