Priyanka Gandhi | ఇప్పటివరకు పార్టీ ప్రచారానికే పరిమితమైన కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లోకి అడుగుపెట్టారు. కేరళలోని వయనాడ్ (Wayanad) లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీ కోసం హస్తం పార్టీ ప్రచారాన్ని మొదలు పెట్టేసింది. ఇందులో భాగంగానే వయనాడ్‌లో ప్రియాంక గాంధీ పోస్టర్లు వెలిశాయి. పార్టీ ప్రకటనతో నగర వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రియాంక పోస్టర్లను ఏర్పాటు చేశారు.
కాగా, ఇటీవలే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ సోదరుడైన రాహుల్ గాంధీ రెండు స్థానాల్లో పోటీ చేసిన విషయం తెలిసిందే. రాయ్‌బరేలీ, వయనాడ్ స్థానాల్లో పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత రాయ్‌బరేలీని అట్టే పెట్టుకుని వయనాడ్ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో సోదరుడి రాజీనామాతో ఖాళీ అయిన వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి హస్తం పార్టీ ప్రియాంక గాంధీని బరిలోకి దింపింది. ఇక ఈ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికను (by-election) నిర్వహించనుంది. నవంబర్ 13న ఈ స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ మంగళవారం ప్రకటించింది.
ఈసీ ప్రకటన వెలువడిన వెంటనే వయనాడ్‌లో ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించింది. దీంతో ప్రియాంక అక్కడ పోటీ చేయడం ద్వారా క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టడానికి పార్టీ రంగం సిద్ధం చేసింది. పార్టీ ప్రకటన పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపింది. రాత్రికి రాత్రే నగర వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రియాంక పోస్టర్లను ఏర్పాటు చేశారు.
Kerala | Congress workers put up posters of party leader Priyanka Gandhi Vadra in Wayanad after she was declared the official candidate of the Congress party. They greeted her by writing ‘Wayanadinte Priyankari’ (Wayanad’s beloved) on the posters.
(Pic Source: Congress leader… pic.twitter.com/iYMDq5tIFc
— ANI (@ANI) October 15, 2024
Also Read..
Omar Abdullah | జమ్ముకశ్మీర్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన ఒమర్ అబ్దుల్లా.. Video
Temple Destroyed | చిత్తూరులో ఆలయాన్ని ధ్వంసం చేసిన దుండగులు.. సీఎం సీరియస్
Chennai Rain | నీట మునిగిన చెన్నై.. రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ