Chennai Rain | తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రాన్ని భారీ వర్షాలు (Heavy Rains) ముంచెత్తుతున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తిరువల్లేరు, కాంచీపురం, చెంగల్పట్టు సహా పలు ప్రధాన నగరాలు నీట మునిగాయి. ముఖ్యంగా తమిళనాడు రాజధాని చెన్నై మహానగరం పూర్తిగా (Chennai Rain) నీట మునిగింది.
#WATCH | Tamil Nadu: Severe waterlogging witnessed in parts of Chennai city after incessant rainfall in the region; visuals from Pattalam area. pic.twitter.com/bMUPUE2jMl
— ANI (@ANI) October 16, 2024
సోమవారం నుంచి చెన్నైలో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. ఈ వర్షానికి చాలా ప్రాంతాలు నీట మునిగాయి. ప్రధాన రహదారులు నదులను తలపిస్తున్నాయి. సబ్‌వేలు, అండర్‌పాస్‌ల్లోకి భారీగా వరద చేరింది. దీంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి కూడా నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
#WATCH | Tamil Nadu: Waterlogging witnessed in parts of Chennai city; visuals from Pattalam area. pic.twitter.com/2MeJd2ApF2
— ANI (@ANI) October 16, 2024
భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన సీఎం స్టాలిన్ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించింది. రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. 17, 18 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఈ మేరకు రెడ్ అలర్ట్ (red alert) జారీ చేసింది. నగరంలో వర్ష పరిస్థితిని సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నానరు.
Students at Sathyabama University, Chennai, are really suffering due to the floods 🌧️😔.#Chennai #ChennaiRains #ChennaiRainsUpdate #ChennaiRains2024 #ChennaiCorporation #chennairain #Chennairainupdate #ChennaiFloods #Floods #RedAlertchennai #RedAlert #Flood2024 pic.twitter.com/O57AitmhTJ
— Dhruv (@theogdhruv) October 15, 2024
తుఫాన్‌గా మారిన అల్పపీడనం..
మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫాన్‌గా (Cyclonic Storm) మారింది. అది వాయవ్య దిశగా కదులుతోంది. ప్రస్తుతం ఆ సైక్లోన్ చెన్నైకి 440, పుదుచ్చేరికి 460, నెల్లూరుకు 530 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గురువారం ఉదయం వరకు పుదుచ్చేరి, నెల్లూరు మధ్య ఆ తుఫాన్ తీరం దాటే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. చెన్నై , నెల్లూరు తీరంతో పాటు రాయలసీమ ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే ఛాన్సు ఉంది. కొన్ని ప్రాంతాల్లో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కూడా కురవనున్నట్లు వెదర్ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఎండీ రోనంకి కుర్మనాథ్ తెలిపారు. తుఫాన్ తీరం దాటే సమయంలో.. 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి.
Trying to stay calm through this #ChennaiFloods, but genuinely wondering – what have the governments been doing since 2015?
Every year we hear about 90% of Stormwater Drain works completed, yet the reality sucks.
We need real solutions, not empty numbers. @mkstalin @Udhaystalin pic.twitter.com/0T4PSoFwct
— Yogesh R (@TheYogeshR) October 15, 2024
Also Read..
కోవర్ట్ ఆపరేషన్ పాత్రధారి అమిత్ షా: కెనడా ఆరోపణ
Yellamma | ఎట్టకేలకు బలగం వేణుకు హీరో దొరికేశాడు.. ఎల్లమ్మ పట్టాలెక్కేది ఎప్పుడో!