Omar Abdullah | జమ్ముకశ్మీర్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన ఒమర్ అబ్దుల్లా.. Video
Omar Abdullah | జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రిగా నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అగ్ర నేత ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకారం చేశారు. జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. శ్రీనగర్‌లోని 'షేర్ యే కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్'లో ఈ ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది.
Omar Abdullah : జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రిగా నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అగ్ర నేత ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకారం చేశారు. జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. శ్రీనగర్‌లోని ‘షేర్ యే కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్’లో ఈ ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ పార్టీలకు చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
వారిలో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా, లోక్‌ససభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, పీడీపీ అధ్యక్షురాలు, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ, ఆప్ సీనియర్ నేత సంజయ్ సింగ్, సీపీఐ నేత డీ రాజా తదితరులు ఉన్నారు.
కాగా ఒమర్ అబ్దుల్లా గతంలో కూడా జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత బీజేపీ, పీడీపీ కూటమి అక్కడ అధికారం చేపట్టింది. 2018లో కూటమి సర్కారు కూలిపోవడంతో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత కేంద్రం జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దుచేసింది. అనంతరం ఇప్పుడే తొలసారిగా జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.
#WATCH | Omar Abdullah takes oath as the Chief Minister of Jammu and Kashmir.
The leaders from INDIA bloc including Lok Sabha LoP Rahul Gandhi, Congress leader Priyanka Gandhi Vadra, JKNC chief Farooq Abdullah, Samajwadi Party chief Akhilesh Yadav, PDP chief Mehbooba Mufti, AAP… pic.twitter.com/IA2ttvCwEJ
— ANI (@ANI) October 16, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

