Temple Destroyed | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఆలయంపై దాడి (Temple Destroyed) జరిగింది. చిత్తూరు జిల్లాలో ఆంజనేయ స్వామి ఆలయాన్ని (Anjaneya Swamy temple) దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) సీరియస్ అయ్యారు.
చిత్తూరు – ములకలచెరువు (Chittoor – Mulakacheruvu) మధ్య గ్రామానికి సమీపంలో ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. పునాదులతో సహా ఆలయాన్ని పెకిలించారు. గేట్లు ధ్వంసం చేశారు. దుండగుల దుశ్చర్యతో ఆలయం ఓ వైపుకు ఒరిగింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు స్థానిక నేతలు తెలిపారు. మరోవైపు ఆలయంపై దాడి ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. దాడికి పాల్పడిన వ్యక్తులను వెంటనే గుర్తించి అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించారు. వారిని కఠినంగా శిక్షించాలన్నారు.
ఆంజనేయ స్వామి ఆలయం ధ్వంసం చేసిన దుండగులు.. సీఎం చంద్రబాబు సీరియస్
చిత్తూరు – ములకలచెరువులో గ్రామానికి కాస్త దూరంగా శ్రీఅభయాంజనేయ స్వామి ఆలయం ఉంది.
అయితే ఆలయాన్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. పునాదులతో సహా ఆలయాన్ని పెకిలించి.. గేట్లు ధ్వంసం చేశారు.
పోలీసులకు… pic.twitter.com/5rQkwrqb4q
— Telugu Scribe (@TeluguScribe) October 16, 2024
Also Read..
Johnson And Johnson | జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థకు భారీ జరిమానా
Magic Movie | ‘మ్యాజిక్’ అంటూ వస్తున్న ‘జెర్సీ’ దర్శకుడు.. విడుదల ఎప్పుడంటే.?