Magic Movie | ‘జెర్సీ’ లాంటి సినిమాతో డెబ్యూ డైరెక్టర్‌గా బ్లాక్ బస్టర్ అందుకున్నాడు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. ఇక ఇదే సినిమాను బాలీవుడ్లో కూడా రీమేక్ చేసి అక్కడ కూడా హిట్ అందుకున్నాడు. అయితే జెర్సీ వచ్చి 5 సంవత్సరాలు అయిన గౌతమ్ నుంచి ఇంకో సినిమా రాలేదు. గత ఏడాది టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండతో గౌతమ్ VD12 అంటూ ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే విజయ్ దేవరకొండతో సినిమా స్టార్ట్ చేసే గ్యాప్‌లో గౌతమ్ తిన్ననూరి ఒక చిన్న సినిమాకు దర్శకత్వం వహించాడు.
గౌతమ్ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం మ్యాజిక్ (Magic). సంగీత నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే ఫస్ట్ లుక్ విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా ఈ మూవీ నుంచి విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాను డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. ఇక ఈ సినిమాను సితార ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తుండగా.. కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నాడు. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
Celebrating the Musical Genius and Rockstar @anirudhofficial on his birthday! #HBDAnirudh 🎸🎹
Chasing the stars and weaving dreams, as the rhythm of #MAGIC guides the way! 🎶
Step into the World of #MAGICFilm In Cinemas from 21st DEC, 2024! 🌠🎼@gowtam19 @vamsi84… pic.twitter.com/6gabCjrMeE
— Sithara Entertainments (@SitharaEnts) October 16, 2024