DA | దీపావళి (Diwali) సందర్భంగా ఉద్యోగులకు కేంద్రం (central government) గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు తెలిసింది. డీఏను (కరవు భత్యం) 3 శాతం పెంచేందుకు (3 Percent DA Hike) కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం. ఈ మేరకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు సంబంధిత వర్గాలను ఊటంకిస్తూ జాతీయ మీడియా పేర్కొంది.
బుధవారం ఉదయం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు ఆమోదించినట్లు తెలిసింది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ మధ్యాహ్నం తర్వాత దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. కేంద్ర కేబినెట్ నిర్ణయంతో కోటి మందికిపైగా ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది.
కాగా కేంద్ర ప్రభుత్వం సాధారణంగా ఏటా రెండుసార్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ (dearness allowance) పెంచుతుంది. కేంద్రం డీఏను సరవించిన నేపథ్యంలో రాష్ట్రాలు సైతం తమ ఉద్యోగులకు ఆ మేరకు డీఏ పెంచే అవకాశం ఉంటుంది. పెరుగుతున్న ధరలకు పరిహారంగా ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ అందజేస్తారు. ఈ ఏడాది మార్చిలో కూడా ఉద్యోగుల డీఏను, పెన్షనర్ల డీఆర్‌ను కేంద్రం 4 శాతం పెంచిన విషయం తెలిసిందే.
Also Read..
Nayab Singh Saini | శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన నయాబ్ సింగ్ సైనీ.. రేపే సీఎంగా ప్రమాణం
Muda chief | సీఎం సిద్ధరామయ్యపై తీవ్ర ఆరోపణలు.. ముడా చీఫ్ రాజీనామా..!
Johnson And Johnson | జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థకు భారీ జరిమానా