జైపూర్: ఒక ఎలుగుబంటి ఇంట్లోకి చొరబడింది. ఆ ఇంట్లో ఉన్న పాలు, నెయ్యి తాగింది. తాపీగా ఆ ఇంటి నుంచి బయటకు వచ్చింది. (Bear Enters Home Drinks Milk) రాజస్థాన్‌లోని భరత్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. రణతంబోర్ టైగర్ రిజర్వ్ సమీపంలో ఉన్న బజోలి గ్రామస్తులు క్రూర మృగాల భయంతో జీవిస్తున్నారు. తాజాగా ఒక ఎలుగుబంటి రాత్రివేళ గ్రామంలో తిరుగుతున్నది. ఇళ్లలోకి చొరబడి ఆహార పదార్థాలు తింటున్నది.
కాగా, రాత్రి వేళ తలుపులు, కిటికీలు మూసి ఉన్న ఒక ఇంటిని ఎలుగుబంటి లక్ష్యంగా చేసుకున్నది. డోర్ ధ్వంసం చేసి లోనికి ప్రవేశించింది. ఆ ఇంట్లో ఉన్న పాలు, నెయ్యి తాగింది. పెరుగు ప్యాకెట్‌ను నోట కరుచుకుని ఆ ఇంటి నుంచి బయటకు వచ్చింది.
మరోవైపు ఇది చూసి గ్రామస్తులు భయాందోళన చెందారు. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆ ఎలుగుబంటిని వీలైనంత త్వరగా పట్టుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. కాగా, కొందరు వ్యక్తులు తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Also Read: