Basavaraj Bommai | నేడు సీఎం పదవికి రాజీనామా చేయనున్న బసవరాజు బొమ్మై
Basavaraj Bommai | కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Assembly Elections) ఓటమికి పూర్తి బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి (Cm) బసవరాజు బొమ్మై (Basavaraj Bommai) తన పదవికి రాజీనామా చేయనున్నారు.
Basavaraj Bommai | కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Assembly Elections) ఓటమికి పూర్తి బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి (Cm) బసవరాజు బొమ్మై (Basavaraj Bommai) తన పదవికి రాజీనామా చేయనున్నారు. ఈరోజు సాయంత్రానికి పూర్తి స్థాయిలో ఫలితాలు వెల్లడైన తర్వాత సీఎం.. గవర్నర్‌కు రాజీనామా పత్రం సమర్పించనున్నట్లు తెలుస్తోంది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ (BJP) ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. మొత్తం 224 స్థానాలకు గానూ ఇప్పటి వరకు 43 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. మరో 21 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇక ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధించింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్ కంటే ఎక్కువ స్థానాల్లోనే విజయం దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు 92 స్థానాల్లో గెలుపొందిన హస్తం పార్టీ.. మరో 44 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది.
కాగా, ఎన్నికల్లో ఓటమికి సీఎం పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం తాము శక్తివంచన లేకుండా శాయశక్తులా కృషి చేశామని, అయినా విజయం సాధించడంలో విఫలమయ్యామని అన్నారు. తాము ఓటమిని అంగీకరిస్తున్నామని చెప్పారు. పూర్తి ఫలితాలు వెల్లడైన తర్వాత తాము సమగ్ర విశ్లేషణ చేసుకుంటామని, లోపాలను సరిదిద్దుకుని లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధిస్తామని అన్నారు.
Also Read..
Karnataka Assembly Election Results 2023 | కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు లైవ్ అప్డేట్స్
Jalandhar Bypoll | కాంగ్రెస్ కంచుకోట బద్దలు.. జలంధర్ లోక్‌సభ స్థానం ఆప్‌దే
Minister KTR: కర్ణాటక ప్రజలకు థ్యాంక్స్ చెప్పిన మంత్రి కేటీఆర్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

