Robbers | కర్ణాటక (Karnataka) రాష్ట్రంలో పట్టపగలే దారి దోపిడీ దొంగలు (Robbers) రెచ్చిపోయారు. ఏటీఎం (ATM)లో డబ్బులు పెట్టేందుకు వచ్చిన వాహనంపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు మరణించగా.. ఇద్దరు బ్యాంకు సిబ్బందికి గాయాలయ్యాయి. ఈ ఘటన బీదర్ (Bidar)లో చోటు చేసుకుంది.
ಬೀದರ್: SBI ಸೆಕ್ಯೂರಿಟಿ ಏಜೆನ್ಸಿ ಸಿಬ್ಬಂದಿ ಮೇಲೆ ಗುಂಡಿನ ದಾಳಿ, ಒಬ್ಬನ ಸಾವು #bidar pic.twitter.com/rt5Vk4Evdo
— eedina.com ಈ ದಿನ.ಕಾಮ್ (@eedinanews) January 16, 2025
ఏటీఎంకు డబ్బులు తరలిస్తున్న వాహనంపై దోపిడీ దొంగలు దాడి చేశారు. బైక్‌పై వచ్చిన దుండగులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ సెక్యూరిటీ గార్డు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరు బ్యాంకు సిబ్బందికి గాయాలైనట్లు తెలిసింది. దాడి అనంతరం డబ్బు పెట్టెలతో దుండగులు అక్కడి నుంచి ఉడాయించారు (money looted). అందులో సుమారు రూ.93 లక్షల నగదు ఉన్నట్లు సమాచారం. మరోవైపు దాడి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిని అక్కడికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. గాయపడిన సిబ్బందిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దొంగల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
⚠️Trigger Warning ⚠️
Bank Staff who came to load money to ATMs were shot dead and money looted by Robbers.
Incident took place near Bidar, Karnataka. pic.twitter.com/LxS2dd8b1Lpic.twitter.com/DTpEKO3Lih
— 👑Che_Krishna🇮🇳💛❤️ (@CheKrishnaCk_) January 16, 2025
Also Read..
Saif Ali Khan | సైఫ్‌పై దాడి ఘటనకు ముందు.. ఫ్రెండ్స్‌తో కరీనా కపూర్ పార్టీ
SpaDeX Docking: ఒక్కటైన 2 శాటిలైట్లు.. డాకింగ్ సక్సెస్ వెనుక ఇస్రో ప్లానేంటి !
Ravishankar | కేటీఆర్ కడిగిన ముత్యంలా బయటకొస్తారు : సుంకె రవిశంకర్