Saif Ali Khan | సైఫ్‌పై దాడి ఘటనకు ముందు.. ఫ్రెండ్స్‌తో కరీనా కపూర్ పార్టీ
Saif Ali Khan | బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) మీద దాడి జరిగిన విషయం తెలిసిందే. దాడి ఘటనకు ముందు సైఫ్ అలీఖాన్ భార్య, బాలీవుడ్ స్టార్ నటి కరీనా కపూర్ (Kareena Kapoor) తన ఫ్రెండ్స్‌తో పార్టీ చేసుకున్నట్లు తెలిసింది.
Saif Ali Khan | బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) మీద దాడి జరిగిన విషయం తెలిసిందే. అతడిపై గుర్తుతెలియని వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. గురువారం తెల్లవారుజామున ముంబైలోని ఆయన నివాసంలోకి చొరబడిన దుండగుడు కత్తితో సైఫ్‌పై దాడి చేశాడు. ఈ దాడిలో ఆయన ఒంటిపై ఆరుచోట్ల గాయాలయ్యాయి. ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో సైఫ్‌కు వైద్యులు శస్త్రచికిత్స చేశారు. మరోవైపు నిందితుడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
కాగా, దాడి ఘటనకు ముందు సైఫ్ అలీఖాన్ భార్య, బాలీవుడ్ స్టార్ నటి కరీనా కపూర్ (Kareena Kapoor) తన ఫ్రెండ్స్‌తో పార్టీ చేసుకున్నట్లు తెలిసింది. తన సోదరి కరిష్మా కపూర్, స్టార్ నటి సోనమ్ కపూర్, రియా కపూర్లతో కలిసి డిన్నర్ డేట్‌ను ఎంజాయ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను కరీనా కపూర్ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసింది. ఈ ఫొటోకు ‘గర్ల్స్ నైట్’ (Girls night) అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్‌గా మారింది.

Kareena 2
సైఫ్ అలీఖాన్‌కు సర్జరీ పూర్తి..
‘సైఫ్ అలీఖాన్‌కు శస్త్రచికిత్స పూర్తైంది. ప్రమాదం నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారు. కుటుంబ సభ్యులంతా క్షేమంగా ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు’ అని నటుడి టీమ్ ప్రకటించింది. అదేవిధంగా లీలావతి ఆసుపత్రిలోని డాక్టర్ నీరజ్ ఉత్తమని, డాక్టర్ నితిన్ డాంగే, డాక్టర్ లీనా జైన్, ఇతర బృందానికి కృతజ్ఞతలు తెలియజేసింది.
సైఫ్ అలీఖాన్‌పై దాడి..
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ మీద దాడి జరిగిన విషయం తెలిసిందే. అతడిపై గుర్తుతెలియని వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. గురువారం తెల్లవారుజామున ముంబైలోని ఆయన నివాసంలోకి చొరబడిన దుండగుడు కత్తితో సైఫ్‌పై దాడి చేశాడు. దీంతో ఆయన ఒంటిపై ఆరుచోట్ల గాయాలయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన లీలావతి దవాఖానకు తరలించారు. సైఫ్ అలీఖాన్‌కు రెండు చోట్ల లోతుగా గాయలయ్యాయి. వెన్నెముక పక్కన కూడా కత్తి పోట్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. తెల్లవారుజామున 2 గంటల సమయంలో దుండగుడు దొంగతనానికి యత్నించాడని, ఈ క్రమంలోనే సైఫ్‌పై దాడి జరిగినట్లు వెల్లడించారు. 3.30 గంటలకు ఆయనను దవాఖానకు తరలించారని చెప్పారు.
Also Read..
Saif Ali Khan | సైఫ్ అలీఖాన్‌కు సర్జరీ పూర్తి.. మీడియాకు వివరాలు తెలియజేయనున్న వైద్యులు..!
Saif Ali Khan | సైఫ్ అలీఖాన్‌పై దాడి ఇంట్లో వారి పనేనా..? వెలుగులోకి కీలక విషయాలు..!
Sara Ali Khan | తండ్రిని చూడటానికి ఆసుపత్రికి చేరుకున్న సైఫ్ పిల్లలు సారా, ఇబ్రహీం.. వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

