‘కరువు పరిస్థితుల్లో కూరగాయల సాగుతో ఆదాయం పొందాలి’
ఎల్‌నినో ప్రభావంతో నెలకొన్న కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించేందుకు ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఉచిత కూరగాయల విత్తనాల చిరు సంచుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వెలుగుపల్లి, బసిరెడ్డిపల్లి గ్రామాల్లో...
– వెలుగుపల్లి, బసిరెడ్డిపల్లి గ్రామాల్లో రైతులకు ఉచితంగా విత్తనాల పంపిణీ
నల్లగొండ రూరల్, నవంబర్ 28 : ఎల్‌నినో ప్రభావంతో నెలకొన్న కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించేందుకు ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఉచిత కూరగాయల విత్తనాల చిరు సంచుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వెలుగుపల్లి, బసిరెడ్డిపల్లి గ్రామాల్లో రైతులకు ఏడు రకాల ఆకుకూరలు, కాయగూరల విత్తనాలను ఉచితంగా అందజేశారు. తక్కువ నీటి వనరులతో సాగు చేసుకునే కూరగాయల పంటలను ప్రోత్సహించడం ద్వారా రైతులు అదనపు ఆదాయం పొందడంతో పాటు, కరువు పరిస్థితుల్లో పంటల వైవిధ్యీకరణకు అవకాశం ఉంటుందని ఉద్యానశాఖ అధికారులు తెలిపారు. ఒక్కో విత్తనాల చిరుసంచి సుమారు అర ఎకరం విస్తీర్ణంలో సాగు చేసుకునేందుకు సరిపోతుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఉద్యాన అధికారి పున్నపురెడ్డి అనంతరెడ్డి, రసూల్పూర్ గ్రామ సర్పంచ్ వెంకన్న, వెలుగుపల్లి సర్పంచ్ పోతేపాక వినోద్, ఉప సర్పంచ్ జె.చంద్రారెడ్డి చేతుల మీదుగా రైతులకు విత్తనాల చిరుసంచులను పంపిణీ చేశారు. కూరగాయల సాగు ద్వారా రైతు కుటుంబాలకు అదనపు ఆదాయం సమకూరడంతో పాటు, ఇంటి అవసరాలకు కావాల్సిన తాజా, పౌష్టికాహార కూరగాయలను స్వయంగా పండించుకునే అవకాశం ఉంటుందని అధికారులు వివరించారు. రైతుల ఆర్థికాభివృద్ధి, కుటుంబ ఆరోగ్యం, కరువు పరిస్థితులను ఎదుర్కొనే ప్రత్యామ్నాయ సాగు విధానాలపై ఉద్యాన శాఖ నిరంతరం అవగాహన కల్పిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ సల్మాన్, హెచ్‌ఈఓలు రవి, కృష్ణతో పాటు వెలుగుపల్లి గ్రామ రైతులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కరువు పరిస్థితుల్లో కూరగాయల సాగుతో ఆదాయం పొందాలి’
Vrushakarma | ‘వృషకర్మ’ కచ్చితంగా థియేటర్లలో చూడాల్సిన సినిమా : నాగచైతన్య
Lakshmi Verma | బీజేపీ ఎంపీ లక్ష్మీ వర్మకు రోడ్డు ప్రమాదం.. చేతికి ఫ్రాక్చర్
వార్డుల వారీగా జీవిత బీమా కౌంటర్లు : ఈఎంసి కమిషనర్ ఆళ్ల శ్రీనివాస రెడ్ది
‘వైరాలో దీక్షా దివస్‌ను విజయవంతం చేయండి’
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

