Sheikh Hasina | ఇటీవలే వెలువడిన లోక్సభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి హ్యాట్రిక్ కొట్టిన విషయం తెలిసిందే. దీంతో నరేంద్ర మోదీ (PM Modi) వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు మోదీ ప్రమాణ స్వీకారమహోత్సవం ఉండబోతోంది. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఢిల్లీలోని కర్తవ్యపథ్ వద్ద ఇప్పటికే అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారు.
మరోవైపు ఈ కార్యక్రమానికి పలుదేశాధినేతలను కూడా కేంద్రం ఆహ్వానించింది. ఇందులో భాగంగా కేంద్రం ఆహ్వానం మేరకు బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి (Bangladesh PM) షేక్ హసీనా (Sheikh Hasina) ఇవాళ ఢిల్లీ చేరుకున్నారు. శనివారం మధ్యాహ్నం ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యారు. బంగ్లా ప్రధానికి పలువురు అధికారులు స్వాగతం పలికారు. రేపు జరగబోయే మోదీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో హసీనా పాల్గొననున్నారు.
#WATCH | Bangladesh PM Sheikha Hasina watches a performance by the artists, as she arrives in New Delhi to attend the oath-taking ceremony of PM-Designate Narendra Modi. pic.twitter.com/ErDjQOoGdd
— ANI (@ANI) June 8, 2024
#WATCH | Delhi: Bangladesh PM Shiekh Hasina arrives in Delhi to attend Prime Minister Designate Narendra Modi’s swearing-in ceremony on June 9.
PM-Designate Modi will take the Prime Minister’s oath for the third consecutive term on June 9, 7.15 pm. pic.twitter.com/rMa2tck8sw
— ANI (@ANI) June 8, 2024
Also Read..
Dhanyawaad Yatra | గెలుపు బావుటా.. యూపీలో ధన్యవాద్ యాత్రకు సిద్ధమైన కాంగ్రెస్ పార్టీ
Ramoji Rao | రామోజీరావు మరణానికి సంతాపంగా ఆదివారం చిత్ర పరిశ్రమ బంద్
Mamata Banerjee | కమ్యూనికేషన్ ప్రపంచానికి ఆయన ఓ దార్శనికుడు.. రామోజీ మృతిపై దీదీ స్పందన