Ramoji Rao | ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు (Ramoji Rao) కన్నుమూసిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థివదేహాన్ని రామోజీ ఫిల్మ్ సిటీకి తరలించారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు అక్కడికి తరలివెళ్లి మీడియా సంస్థ అధినేతకు నివాళులర్పిస్తున్నారు.
రామోజీ రావు మరణ వార్త సినీ ఇండస్ట్రీని తీవ్రంగా కలచివేసింది. ఈ నేపథ్యంలో రామోజీ మృతి పట్ల సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన మరణానికి సంతాప సూచికంగా ఆదివారం చిత్ర పరిశ్రమకు బంద్ ప్రకటించారు. ఈ మేరకు చలనచిత్ర నిర్మాతల మండలి ప్రకటన విడుదల చేసింది. ఆదివారం అన్ని షూటింగ్‌లూ నిలిపివేస్తున్నట్లు తెలిపింది.
Also Read..
Ramoji Rao | ఈనాడు నుంచి ఈటీవీ విన్ వరకు.. రామోజీ ప్రస్థానం
Mamata Banerjee | కమ్యూనికేషన్ ప్రపంచానికి ఆయన ఓ దార్శనికుడు.. రామోజీ మృతిపై దీదీ స్పందన
Ramoji Rao | రామోజీ మృతితో మీడియా, వినోద రంగం ఓ టైటాన్‌ను కోల్పోయింది : రాష్ట్రపతి ముర్ము