Manmohan Singh | మాజీ ప్రధానమంత్రి, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ (Manmohan Singh) మృతి పట్ల బంగ్లాదేశ్ (Bangladesh) తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ (Muhammad Yunus) సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు మన్మోహన్ సింగ్‌కు ఘనంగా నివాళులర్పించారు. ఢాకాలోని భారత హైకమిషన్‌ను సందర్శించిన యూనస్.. అక్కడ మన్మోహన్ సింగ్ చిత్రపటం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. అనంతరం అక్కడి సంతాప పుస్తకంలో సంతాప సందేశాన్ని కూడా రాశారు.
Bangladesh Chief Adviser Muhammad Yunus paid tribute to former Prime Minister Manmohan Singh, who died last week. Professor Yunus visited the Indian High Commission in Dhaka and placed a floral wreath. He also wrote a condolence message in the condolence book opened at the High… pic.twitter.com/40DmKvdArA
— ANI (@ANI) December 31, 2024
మన్మోహన్ సింగ్ (Manmohan Singh) మరణించిన విషయం తెలిసిందే. ఈనెల 26న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో తుదిశ్వాస విడిచారు. ఢిల్లీలోని నిగమ్‌బోధ్ ఘాట్‌లో శనివారం ఆయన అంత్యక్రియలు జరిగాయి. కేంద్రం అధికార లాంఛనాలతో ఆయనకు తుది వీడ్కోలు పలికింది. మన్మోహన్ పెద్ద కూతురు ఉపిందర్ సింగ్ తన తండ్రికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఆయన అస్తికలను (ashes immerse) కుటుంబ సభ్యులు యమునా నదిలో (Yamuna river) కలిపారు. మజ్జు కా తిలా గురుద్వారా సమీపంలోని అష్ట్ ఘాట్ వద్ద సిక్కు సంప్రదాయాలను అనుసరించి ఆదివారం ఆయన అస్తికలను నదిలో నిమజ్జనం చేశారు.
Also Read..
“Manmohan Singh | మన్మోహన్ సింగ్ అస్తికలను యమునా నదిలో కలిపిన కుటుంబ సభ్యులు”
“Manmohan Singh | దేశానికి దశదిశ చూపిన ప్రధాని.. ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత ఆయనదే..!”
“Manmohan Singh | భారత ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించిన మన్మోహన్.. 1991 బడ్జెట్ ఓ గేమ్ ఛేంజర్”
“Manmohan Singh | ఆర్బీఐ గవర్నర్‌గా ఉన్న మన్మోహన్ సింగ్‌ను.. రాజకీయాల్లోకి తీసుకొచ్చిన పీవీ”
“Manmohan Singh: ప్రధాని మోదీని తీవ్రంగా విమర్శించిన మన్మోహన్ సింగ్”