Air India | అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం అనంతరం దేశీయ ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా (Air India) తరచూ వార్తల్లో నిలుస్తోంది. ప్రమాదం తర్వాత నుంచి సంస్థకు చెందిన పలు విమానాల్లో సాంకేతిక సమస్యలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా ఆ సంస్థ మరోసారి హెడ్‌లైన్స్‌లో నిలిచింది. ముంబై నుంచి బ్యాంకాక్ వెళ్లే ఓ ఎయిర్ ఇండియా విమానం (Bangkok Bound Air India Flight) రెక్కలో పక్షి గూడు (Bird Nest Found Inside Wing) కలకలం రేపుతోంది.
Mumbai to Bangkok Air India Flight AI2354 Departure time 7:45am delayed to take off more than 3 hours. Ground staff are trying to remove a bird’s nest from inside the wing #aviation pic.twitter.com/Q0E1JVG724
— Ayaz Aziz (@aayaazzizz) June 25, 2025
ఎయిర్ ఇండియాకు చెందిన AI2354 విమానం నిన్న ఉదయం ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బ్యాంకాక్ వెళ్లేందుకు రన్‌వేపై సిద్ధంగా ఉంది. ఉదయం 7:45 గంటలకు విమానం బయల్దేరాల్సి ఉంది. అయితే, విమానం రెక్క లోపల పక్షి గూడును ఓ ప్రయాణికుడు గుర్తించి విమాన సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. వారు గ్రౌండ్ స్టాఫ్‌కు సమాచారం ఇచ్చారు. వెంటనే సిబ్బంది రన్‌వేపై ఉన్న విమానం వద్దకు వచ్చి వాటిని తొలగించారు. ఈ కారణంగా విమానం దాదాపు మూడు గంటలు ఆలస్యంగా బయల్దేరి వెళ్లింది. విమానం రెక్క నుంచి సిబ్బంది పక్షి గూడును తొలగిస్తున్న వీడియోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
Also Read..
“ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య”