ముంబై, జూన్ 24 : దేశీయంగా విమానాల్లో ప్రయాణించేవారి సంఖ్య అంతకంతకు పెరుగుతున్నది. మే నెలలో 140.56 లక్షల మంది దేశీయంగా ప్రయాణించారని డీజీసీ తాజాగా వెల్లడించింది. క్రితం ఏడాది ప్రయాణించిన 137.96 లక్షల మందితో పోలిస్తే 1.89 శాతం పెరిగారని తెలిపింది.
వీరిలో ఇండిగో విమానాల్లో 93 లక్షల మంది ప్రయాణించగా, ఎయిర్ ఇండియాలో 37.22 లక్షల మంది, ఆకాశ ఎయిర్‌లో 7.48 లక్షలు, స్పైస్‌జెట్‌లో 3.40 లక్షల మంది ప్రయాణించారు.