Air India | అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం అనంతరం దేశీయ ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా (Air India) తరచూ వార్తల్లో నిలుస్తోంది. ప్రమాదం తర్వాత నుంచి సంస్థకు చెందిన పలు విమానాల్లో సాంకేతిక సమస్యలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా ఆ సంస్థ మరోసారి హెడ్‌లైన్స్‌లో నిలిచింది. ఈసారి విమానంలోని పలువురు సిబ్బంది, ప్రయాణికులు అస్వస్థతకు (passengers ill) గురయ్యారు.
ఎయిర్ ఇండియాకి చెందిన AI130 విమానం సోమవారం లండన్ నుంచి ముంబైకి బయల్దేరింది. అయితే, విమానం గాల్లో ఉండగా.. అనూహ్య ఘటన చోటు చేసుకుంది. అందులోని ఐదుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయాన్ని టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా సంస్థ వెల్లడించింది. విమానం ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయిన వెంటనే అస్వస్థతకు గురైన వారిని నగరంలోని ఓ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపింది. చికిత్స అనంతరం వారిని డిశ్చార్జ్ చేసినట్లు వెల్లడించింది. అయితే, వారు అస్వస్థతకు గురవడానికి గల కారణాలను మాత్రం సంస్థ వెల్లడించలేదు. ఫుడ్ పాయిజన్ (food poisoning) కారణంగానే ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు ఎయిర్‌లైన్స్ తెలిపింది. ఆ సమయంలో విమానంలో ఎంతమంది ఉన్నారన్నది మాత్రం ఎయిర్‌లైన్స్ వెల్లడించలేదు. మరోవైపు ఈ ఘటనను విమానయాన భద్రతా నియంత్రణ సంస్థ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌కు నివేదించినట్లు ఎయిర్ ఇండియా తెలిపింది.
Also Read..
Qatar | అమెరికా వైమానిక స్థావరంపై ఇరాన్ దాడులు.. ఖతార్‌లోని భారతీయులకు ఎంబసీ కీలక అడ్వైజరీ
Operation Sindhu: ఆపరేషన్ సింధు.. ఇజ్రాయిల్ నుంచి ఢిల్లీ చేరుకున్న 161 మంది భారతీయులు
పాక్ విమానాలకు గగనతల నిషేధం పొడిగింపు