న్యూఢిల్లీ: ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య వార్ వల్ల.. అక్కడ చిక్కుకున్న భారతీయుల్ని రప్పించేందుకు ఆపరేషన్ సింధు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఇజ్రాయిల్‌లో చిక్కుకున్న సుమారు 161 మంది ఇవాళ ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీ చేరుకున్నారు. తొలుత వాళ్లు భూమార్గంలో జోర్డాన్‌కు వెళ్లి.. అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వచ్చారు. సురక్షితంగా ఢిల్లీ చేరుకున్న అరవింద్ శుక్లా అనే ప్రయాణికుడు ఆ ఆపరేషన్ గురించి వివరించాడు.
తాము ఇజ్రాయిల్ నుంచి వచ్చామని, జోర్డాన్ నుంచి తమ విమానం ప్రారంభమైందన్నాడు. గత సెప్టెంబర్‌లో ఇజ్రాయిల్‌కు వెళ్లినట్లు చెప్పాడతను. అక్కడ పరిస్థితి బాగా లేదని, తలపై నుంచి మిస్సైళ్లు వెళ్లడాన్ని చూసినట్లు పేర్కొన్నాడు. చాలా భయానక పరిస్థితులు ఉన్నాయన్నాడు. ఓ హాస్టల్లో ఉన్నామని, రాత్రిపూట మొత్తం సైరన్లు వినిపించేవాని, ఆ టైంలో మేం బంకర్లకు వెళ్లేమాళ్లమన్నాడు. తాను జెరుసలాంలో ఉన్నట్లు ఆ వ్యక్తి తెలిపాడు.
#WATCH | Under #OperationSindhu, the first flight from Israel carrying 161 passengers landed in New Delhi today. They were taken to Jordan via land border and then evacuated on a flight.
An evacuee, Arvind Shukla says, “I am coming here from Israel. Our flight took off from… pic.twitter.com/niRP9fMrX1
— ANI (@ANI) June 24, 2025
తమను సురక్షితంగా భారత్‌కు తీసుకువచ్చిన ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పాడు. 160 మంది చాలా క్రమ పద్ధతిలో తీసుకువచ్చినట్లు చెప్పాడతను. ఆహారం, నీళ్లు, అన్ని సదుపాయాలు కల్పించారన్నారు. ఎయిర్‌స్పేస్ సమస్యల వల్ల విమానం ఆలస్యమైందన్నాడు. ఎంబసీ సిబ్బంది తమకు సహకరించినట్లు తెలిపాడు.
ఇజ్రాయిల్ నుంచి ఇండియా చేరుకున్న వారిలో ఓ వృద్ధ జంట కూడా ఉన్నది. తమ కొడుకు ఇజ్రాయిల్‌లో ఉన్నాడని, తమకు మనువడు పుట్టాడని, వాళ్లు అక్కడే ఉంటారని, తాము మాత్రమే ఇండియాకు వచ్చినట్లు త్రయంబక్ కోలే తెలిపారు. తమను సురక్షితంగా తీసుకువచ్చిన భారత ప్రభుత్వానికి థ్యాంక్స్ తెలిపారు. తమ తలల పైనుంచి బాంబులు వెళ్లడాన్ని చూసినట్లు అతను తెలిపాడు.
#WATCH | Delhi: An elderly couple is among the 161 passengers evacuated from Israel and brought to India today.
Triambak Kole says, “It had been 1.5 months since I was in Israel. The situation escalated there suddenly…We could hear explosions at any time of the day…We were… pic.twitter.com/ubgov77LAT
— ANI (@ANI) June 24, 2025